Tesla: గత నెలలో దక్షిణ కొరియాలో కేవలం ఒక్క కారునే విక్రయించిన టెస్లా..ఎందుకంటే..?
టెస్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. యుఎస్,చైనాలో టెస్లా కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే,టెస్లా గత నెలలో ఒక కారును మాత్రమే విక్రయించింది.అది ఎక్కడో,ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెస్లా దక్షిణ కొరియాలో అతిపెద్ద విక్రయాల క్షీణతను ఎదుర్కొంటుంది. ఇందుకు వివిధ కారణాలను మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. US తర్వాత టెస్లా అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. అందుకే టెస్లా చైనాలోని షాంఘైలో గిగాఫ్యాక్టరీని నిర్మించింది. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కార్లు రవాణా అవుతాయి. కొరియాలో విక్రయించే టెస్లా కార్లు కూడా చైనాలో తయారు చేయబడ్డాయి. కొరియా మార్కెట్‌లో టెస్లా కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.
చైనా తయారీ కార్లను కొనేందుకు దక్షిణ కొరియా విముఖత
చైనా నుంచి దిగుమతులు అమ్మకాలు దారుణంగా క్షీణించాయి.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టెస్లా కార్ మోడల్ అయిన 'Model Y' కూడా పెద్దగా అమ్ముడుపోలేదనేది ప్రస్తుత సమాచారం. దీంతో ఒక్క కంపెనీనే కాదు యావత్ ఆటోమొబైల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. చైనా తయారీ కార్లను కొనేందుకు దక్షిణ కొరియా వాసులు విముఖత చూపడమే అందుకు కారణం. కొన్నిసంవత్సరాల క్రితం అనేక చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. గోప్యత,డేటా లీకేజీ,భద్రతా కారణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.కొరియన్లు చైనీస్ నిర్మిత టెస్లా కార్లతో ఇలాంటి గోప్యతా సమస్యలకు భయపడుతున్నారు. కొరియన్లు టెస్లాకు దూరంగా ఉండటానికి ఇది మరొక కారణం.అదే సమయంలో,దక్షిణ కొరియాలో టెస్లా కార్లు మాత్రమే కాకుండా మొత్తం EVఅమ్మకాలు క్షీణించాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 80% క్షీణత
డిసెంబరుతో పోలిస్తే జనవరిలో కొరియాలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 80 శాతం పడిపోయాయని సియోల్‌కు చెందిన పరిశోధకుడు గారిసు,కొరియా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ద్రవ్యోల్బణం,అధిక వడ్డీ రేట్లు EV అమ్మకాలు తగ్గడానికి ఓ కారణం.ఈ పరిస్థితిలో, ప్రజలు తమ ఖర్చులను చాలా వరకు తగ్గించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొత్త కార్ల కొనుగోలు తగ్గిందని అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో సహా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం కూడా అమ్మకాలను దెబ్బతీస్తోంది. దీని కారణంగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు దాదాపు 80 శాతం భారీ అమ్మకాలు క్షీణించాయి.
దక్షిణ కొరియాలో మోడల్ Y ప్రసిద్ధ కారు
గత సంవత్సరం ప్రారంభంలో,టెస్లా కొరియాలో బలమైన అమ్మకాలను సాధించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ EV అమ్మకాలు జనవరి 2024లో కేవలం ఒక యూనిట్‌కు పరిమితం చేయబడ్డాయి. టెస్లా మోడల్ Y దక్షిణ కొరియాలో ఒక ప్రసిద్ధ కారు మోడల్. ఇందులో గత జనవరిలో ఒక యూనిట్ మాత్రమే విక్రయించబడింది. ఈ వార్త మొత్తం మార్కెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
గుజరాత్‌లో EV ప్లాంట్ నిర్మించనున్న టెస్లా
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం, ద్రవ్యోల్బణంతో సహా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలు సానుకూలంగా మారడంతో ఈ పరిస్థితి మారుతుందని అంచనా వేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్న టెస్లా కార్లు త్వరలో భారత్‌లో అరంగేట్రం చేయబోతున్నాయి. టెస్లా,కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. అమెరికన్ EV దిగ్గజం గుజరాత్‌లో EV ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.