LOADING...
Best Selling Cars : ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు!
ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు!

Best Selling Cars : ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాహనాలపై జీఎస్టీని తగ్గించింది. గతంలో కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు 17-22 శాతం సెస్ ఉండేది. అయితే ఇప్పుడు చిన్న కార్లపై పన్ను కేవలం 18 శాతంగా నిర్ణయించడంతో పాటు సెస్‌ను పూర్తిగా ఎత్తివేసింది. దీని ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. ఈ తగ్గింపుతో పలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ధరలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 2025లో దేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 5 కార్లు, వాటి అమ్మకాల గణాంకాలు, ప్రైజ్ కట్ వివరాలు ఇలా ఉన్నాయి:

Details

1) మారుతీ సుజుకీ ఎర్టిగా

ఆగస్టులో 18,445 యూనిట్ల ఎర్టిగా విక్రయాలతో మారుతీ సుజుకీ టాప్ సెల్లర్‌గా నిలిచింది. అయితే, ఆగస్టు 2024లో 18,580 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 1% తగ్గాయి. కొత్త జీఎస్టీ రూల్స్ ప్రకారం ఎర్టిగాపై రూ. 47,000 వరకు ప్రయోజనాలు వినియోగదారులకు అందుతున్నాయని డీలర్లు తెలిపారు.

Details

 2) మారుతీ సుజుకీ డిజైర్

డిజైర్ ఆగస్టు 2025లో 16,509 యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే నెలలో కేవలం 10,627 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈ ఏడాది అమ్మకాలు 55% పెరిగాయి. వేరియంట్‌ను బట్టి ఇప్పుడు రూ. 87,000 వరకు తగ్గింపుతో డిజైర్ అందుబాటులో ఉంది. 3) హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా (క్రెటా N-Line, క్రెటా EV కలిపి) 15,924 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని సాధించింది. ఆగస్టు 2024లో 16,762 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 5% తగ్గుదల నమోదైంది. జీఎస్టీ మార్పుల తర్వాత క్రెటాపై రూ. 72,145 వరకు, క్రెటా N-Line పై రూ. 71,762 వరకు తగ్గింపు లభిస్తోంది.

Details

4) మారుతీ సుజుకీ వాగన్‌ఆర్

ఆగస్టు 2025లో వాగన్‌ఆర్ 14,552 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 12% తగ్గినా, టాప్ 5 లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల వాగన్‌ఆర్ ధరలు రూ. 64,000 వరకు పడిపోయాయి. 5) టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ (నెక్సాన్ EV సహా) ఆగస్టు 2025లో 14,004 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 12,289 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి 14% వృద్ధి నమోదైంది. జీఎస్టీ 2.0 ప్రయోజనాల కారణంగా నెక్సాన్‌పై రూ. 1.55 లక్షల వరకు ధర తగ్గింపు లభిస్తోంది.