
Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ట్రాఫిక్‌లో రెండు నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉంటే, ఇంధనాన్ని ఆదా చేయడానికీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ బైకులు, బస్సులు, ఆటోలు వంటి వాహనాలు ఇంజన్ ఆఫ్ చేస్తాం.
అయితే, రైళ్ల విషయానికి వస్తే ఇది పూర్తి భిన్నం. డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ట్రైన్‌లు స్టేషన్‌లో ఎక్కువసేపు ఆగినప్పటికీ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది.
దీనికి కారణాలు ఏమిటి? లోకోపైలెట్లు ఇంజన్ ఆఫ్ చేయకుండా ఎందుకు ఉంచుతారు? దీని వెనుక ఉన్న అసలు విషయాలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం.
వివరాలు
ఇంధన ఖర్చు
స్టేషన్‌లో ఎంతసేపు ఆగినా,డీజిల్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తారు.ఎందుకంటే, ఇంజన్‌ను ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడం చాలా సమయాన్ని తీసుకుంటుంది.
అలాగే ఫ్యూయల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది.ఇంజన్ వేడెక్కేందుకు కూడా సుమారు అరగంట సమయం పడుతుంది.
ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి,తద్వారా ట్రైన్ సమయానికి స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
ఎలక్ట్రిక్ ట్రైన్‌ల విషయంలో:
ఎలక్ట్రిక్ ట్రైన్లకూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు.సిగ్నల్ వచ్చిందంటే ఇంజన్ వెంటనే సిద్ధంగా ఉండాలి.ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల తిరిగి ఆన్ చేసి రైలు మొదలవడానికి సమయాన్ని వృథా చేస్తుంది. ఇంజన్ తరచుగా ఆఫ్-ఆన్ చేయడం వల్ల టెక్నికల్ సమస్యలు కూడా ఏర్పడతాయి, ఇంజన్ పనితీరు ప్రభావితమవుతుంది.
వివరాలు
మరొక ముఖ్య కారణం ఏంటంటే..
ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడానికి మరో ముఖ్య కారణం ఎయిర్ సిస్టం. బ్రేక్‌లను ఛార్జ్ చేయడానికి ఎయిర్ సిస్టం ఇంజన్‌తో ముడిపడి ఉంటుంది.
ఇంజన్ ఆఫ్ చేస్తే, ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతుంది. బ్రేక్ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుంది. ఇంజన్ మళ్లీ ఆన్ చేయగానే, ఎయిర్ సిస్టం పనిచేయడం ప్రారంభమవుతుంది, కానీ బ్రేక్‌లను పూర్తిగా రీఛార్జ్ చేయడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది.
ఈ సమయంలో ప్రయాణికులు నిరీక్షించవలసి వస్తుంది.
వివరాలు
నిరంతర సమర్థత
ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల సమయాన్ని ఆదా చేయడంతో పాటు, బ్రేక్ సిస్టం నిరంతరం ఛార్జింగ్‌లో ఉండి ప్రమాదాలను నివారిస్తుంది.
అందుకే, లోకోపైలెట్లు ఇంజన్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచడం మేలని భావిస్తారు, సిగ్నల్ పడగానే ట్రైన్ సజావుగా ప్రయాణం కొనసాగుతుంది.