Bitcoin: టెలిగ్రామ్‌లో మెసేజ్.. క్లిక్ చేస్తే రూ.70 లక్షల బిట్ కాయిన్స్ మాయం
ఈ వార్తాకథనం ఏంటి
వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం ఓ సైబర్ నేరం వెలుగుచూసింది. దీంలో ఎనిమిదేళ్లుగా భద్రంగా దాచుకున్న రూ.70 లక్షల విలువైన 15 బిట్‌కాయిన్లను ఓ సైబర్ నేరస్థుడు కాజేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం, కొత్తకోటకు చెందిన యాదయ్య అనే వ్యక్తికి రెండు రోజుల క్రితం టెలిగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి సందేశం వచ్చింది.
ఆ సందేశంపై నమ్మకంతో యాదయ్య తన వద్ద ఉన్న బిట్‌కాయిన్లకు సంబంధించిన వివరాలు, కోడ్‌లను ఆ వ్యక్తితో పంచుకున్నారు.
అతి తక్కువ సమయంలోనే రూ.70 లక్షల విలువైన బిట్‌కాయిన్లను ఆ గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారని యాదయ్య గుర్తించారు.
Details
పోలీసులను అశ్రయించిన బాధితుడు
అతను వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత వనపర్తి సైబర్ క్రైమ్ డీఎస్పీ రత్నంను కలిసి, కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్సై ఆనంద్ తెలిపారు.