Page Loader
8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు

8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు పెంచే లక్ష్యంతో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జాప్యం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సంకల్పించారని తెలిపారు.

వివరాలు 

త్వరలోనే కొత్త కమిషన్‌కి ఛైర్మన్, ఇద్దరు సభ్యులు

ఈ క్రమంలోనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం ఉన్న 7వ పే కమిషన్ 2016లో ఏర్పాటై, దాని గడువు 2026లో ముగుస్తుందని చెప్పారు. అయితే ఆ గడువుకన్నా ముందే, 2025లోనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 7వ పే కమిషన్ గడువు ముగిసే ముందు వేతనాల పెంపుపై సిఫారసులు పొందే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కొత్త కమిషన్‌కి ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమిస్తామని మంత్రి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 8వ కేంద్ర వేతన సంఘానికి ప్రధాన మంత్రి ఆమోదం