Social Media : టిక్‌టాక్, రెడ్డిట్, యూట్యూబ్, మెటాలపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. కొందరు అవసరానికి ఉపయోగిస్తుండగా, మరికొందరు ఈ యాప్ లకు బానిసలు అవుతున్నారు.
ఈ క్రమంలోనే టిక్ టాక్, రెడ్డిట్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ చాటింగ్ అంటూ వాడికి అడిక్ట్ అవుతున్నారు.
ఫలితంగా డిప్రెషన్ కు కావడంతో ఆరోగ్యం క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
తాజాగా కెనడియన్ వ్యక్తి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించేలా ఈ యాప్ లు ఉన్నాయంటూ కోర్టులో దావా వేశారు.
సోషల్ మీడియా కంపెనీలైన టిక్‌టాక్, యూట్యూబ్, రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లపై క్లాస్-యాక్షన్ దావాను వేయడం గమనార్హం.
Details
యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి
ఫేస్ బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వినియోగదారులను బానిసలుగా మారుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
యాప్‌ల రూపకల్పనలో సోషల్ మీడియా కంపెనీలు నిర్లక్ష్యంగా వహిస్తాయని మరోవైపు వాదనలు కూడా వినిపించాయి.
ఏడు నుండి 11 సంవత్సరాల వయస్సు గల కెనడియన్ పిల్లలలో 52శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని చెప్పారు.
వినియోగదారుల ఆరోగ్యం, భద్రత కోసం యజమాన్యాలు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని బ్రాల్ట్ పేర్కొన్నాడు.
మరోవైపు విద్యా వ్యవస్థకు అంతరాయం కలిగించాయని పేర్కొన్నారు.