
Gold price: పసిడి చరిత్రలో నూతన మైలురాయి.. రూ.98వేలు దాటి రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురిక్షత పెట్టుబడిగా పసిడిపైనే దృష్టి కేంద్రించరించడంతో గోల్డ్ రేట్లు లాభాల బాట పట్టాయి.
ఈ ప్రభావంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ఒక్కరోజులోనే రూ.1,650 పెరిగి రూ.98,100ను తాకింది.
అంతే కాకుండా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా ఇదే మేర పెరిగి రూ.97,650కు చేరుకుంది. అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ.97,700గా నమోదైంది.
Details
కిలో వెండి రూ.99,400
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ఒక్కరోజులోనే రూ.1,900 పెరిగి రూ.99,400ను తాకింది.
మంగళవారం కిలో వెండి ధర రూ.97,500 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా చూస్తే, బంగారం ఔన్సుకు ఇంట్రాడేలో గరిష్ఠంగా 3,318 డాలర్లను తాకగా, ప్రస్తుతం ఇది 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఈ పరిణామాలు బంగారంపై పెట్టుబడి చేసేవారికి ఆసక్తికరమైన సంకేతాలను ఇస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.