
Amazon: ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్లకు ఎక్కువ ప్రమోషన్లు.. 91శాతం మంది సీఈఓల అభిప్రాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలోని 91 శాతం సీఈఓలు రిమోట్ వర్కర్ల కంటే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన ఆఫర్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
KPMG 2024 CEO ఔట్‌లుక్ సర్వే ప్రకారం, భారత CEOs లు ప్రీ-పాండమిక్ విధానాలకు మరలుతున్నారని తేలింది.
125 మంది భారత CEOలతో చేసిన ఈ సర్వేలో, 78 శాతం మంది CEOలు రాబోయే మూడేళ్లలో కార్యాలయానికి తిరిగి వచ్చే ఉద్యోగులను ఎక్కువగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 83 శాతంగా ఉంది. కేవలం 14 శాతం మాత్రమే పూర్తి రిమోట్ వర్క్ మోడల్‌కు మద్దతు తెలపగా, 30 శాతం CEOలు హైబ్రిడ్ విధానం ఆశిస్తున్నారని సర్వే పేర్కొంది.
Details
ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే
భారత సీఈఓలలో బలమైన భాగం కార్యాలయంలోనే భవిష్యత్తు ఉందని నమ్ముతున్నానని KPMG భాగస్వామి సునీత్ సిన్హా పేర్కొన్నారు.
కోవిడ్ అనంతరం ఉద్యోగులు తమ పని విధానాలను తిరిగి అంచనా వేస్తున్నందున, వ్యాపారాలు భారతదేశ ప్రతిభా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు.
అమెజాన్, డెల్ వంటి కార్పొరేట్ కంపెనీలు, వారానికి ఐదు రోజులు కార్యాలయంలోనే పనిచేయాలని తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది.
అమెజాన్ CEO ఆండీ జాస్సీ ప్రకారం, 2025 జనవరి 2 నుండి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 73 శాతం మంది అమెజాన్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.