Page Loader
Adani Group: అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం 
అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం

Adani Group: అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అంబుజా సిమెంట్స్‌ అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్‌ (ఎస్‌ఐఎల్‌) పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లావాదేవీని 9-12 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విలీనం ద్వారా సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించడం, గవర్నెన్స్‌ను మెరుగుపరచడం సాధ్యమవుతుందని అంబుజా సిమెంట్స్‌ తన ప్రకటనలో పేర్కొంది. అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్‌ 2023లో సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసి, అందులో 58.08 శాతం వాటాలు పొందింది. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ను కూడా సంస్థ అధీనంలోకి తీసుకుంది.

వివరాలు 

ప్రతి 100 సంఘీ ఇండస్ట్రీస్‌ షేర్లకు అంబుజా సిమెంట్స్‌ 12 షేర్ల జారీ

విలీన స్కీము ప్రకారం, ప్రతి 100 సంఘీ ఇండస్ట్రీస్‌ షేర్లకు అంబుజా సిమెంట్స్‌ 12 షేర్లను జారీ చేయనుంది. మరోవైపు, పెన్నా సిమెంట్‌ ఈక్విటీ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 321.50 చెల్లించనుంది. సంఘీ ఇండస్ట్రీస్‌, పెన్నా సిమెంట్స్‌ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్‌ షేరు ముఖ విలువ రూ. 2గా నిర్ణయించబడింది.