ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి
అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది. జార్జ్ సొరోస్ కు చెందిన విదేశీ మీడియా కావాలనే కుట్రలు పన్నుతోందని పేర్కొంది.గతంలో హిండెన్ బర్గ్ నివేదికలో పొందుపర్చిన విషయాలే ఇందులోనూ ఉన్నాయని, ఇవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది. అదానీ సన్నిహితులు కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు సదరు నివేదికలో పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలతో అదానీ, లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో దాదాపు 150 మిలియన్ డాలర్ల మేర అదానీ గ్రూప్ నష్టపోయింది.