
Vijay Shekhar Sharma: విజయ్ శేఖర్ శర్మ సందేహం.. వాట్సప్ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ కొత్త అప్‌డేట్ కారణంగా యూజర్ల ప్రైవసీ భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదే అంశాన్నిపేటియం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ప్రస్తావించారు. వాట్సప్ ఇప్పుడు వినియోగదారుల వ్యక్తిగత చాట్స్‌ను చదవగలదా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలపై వాట్సప్ అధికారికంగా స్పందించింది. వాట్సప్ అందించిన కొత్త సదుపాయాల్లో ఒకటి యూజర్ల చాట్స్‌లో ఏఐకి ప్రాప్యత ఇవ్వడం.
వివరాలు
విజయ్ శేఖర్ శర్మ ప్రజలకు హెచ్చరికలు
ఈ మార్పు నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. "వాట్సప్ ఈ రోజు నుంచి ఏఐకి మీ సంభాషణలను చదివే అవకాశం కల్పిస్తోంది. మీరు దీన్ని నివారించాలనుకుంటే, సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్ ఆన్ చేయాలి" అంటూ ఆయన ఎక్స్‌లో మంగళవారం పోస్ట్ చేశారు. అదేవిధంగా 'అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ' ఎలా యాక్టివేట్ చేయాలో సూచిస్తూ స్క్రీన్‌షాట్‌లు కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. అయితే, ఈ ఆరోపణలను వాట్సప్ తిరస్కరించింది. మెటా ఏఐ వినియోగం పూర్తిగా యూజర్ల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని, వ్యక్తిగత మెసేజ్‌లను అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయదని సంస్థ స్పష్టం చేసింది.
వివరాలు
మెటా ఏఐతో ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా అనేది వినియోగదారుల నిర్ణయం
ఎల్లప్పుడూ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రైవేట్ చాట్స్ సురక్షితంగా ఉంటాయని వాట్సప్ ప్రతినిధి పేర్కొన్నారు. యూజర్లు స్వయంగా ఏఐకి మెసేజ్ పంపినప్పుడు లేదా తమ చాట్స్‌లో దాన్ని ఉపయోగించినపుడే, వారు షేర్ చేసిన సమాచారానికి మాత్రమే యాక్సెస్ లభిస్తుందని తెలిపారు. అదనంగా, "మెటా ఏఐ మీ సందేశాన్ని చదివిందా లేదా అనే వివరాలు మెసేజ్ ఇన్ఫోలో యూజర్లు చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు 'అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ'ని ఆన్ చేస్తే, కొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను వాడలేరు. మెటా ఏఐతో ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల నిర్ణయం" అని వాట్సప్ స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ శేఖర్ శర్మ చేసిన ట్వీట్
🚨IMP If you are part of WhatsApp group. Today onwards WhatsApp is allowing ai to read chats. ‼️‼️
— Vijay Shekhar Sharma (@vijayshekhar) August 19, 2025
So enable this setting to block it. pic.twitter.com/VhJomO4Msd