Page Loader
Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు
ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు

Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది దేశీయ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగిన విషయం తెలిసిందే. 2024లో ఇప్పటివరకు 91 కంపెనీలు మెయిన్‌ బోర్డ్‌ ద్వారా ఐపీఓలకు వచ్చి రూ.1.59 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించాయి. ఈ వారం కూడా దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి కొనసాగనుంది. మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఎస్‌ఎంఈ కేటగిరీ నుంచి రెండు కంపెనీలు కూడా ఐపీఓలకు రానున్నాయి. ఇక వీటితో పాటు ఆరు కంపెనీలు మార్కెట్లో లిస్ట్‌ కానున్నట్లు తెలిసింది.

Details

ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ 

మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 31 నుంచి ప్రారంభమవుతుంది. ట్రాక్టర్లు, క్రేన్లు తయారుచేసే ఈ సంస్థ రూ.260.15 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ఐపీఓలో భాగంగా 1,21,00,000 షేర్లను జారీ చేయనుంది. ధర శ్రేణి రూ.204- రూ.215గా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్ జనవరి 2న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్‌, లిస్టింగ్‌ తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఎస్‌ఎంఈ విభాగం నుంచి లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఐపీఓ కూడా రానుంది. ఈ కంపెనీ డ్రై ఫ్రూట్స్‌, మసాలా ఉత్పత్తులను తయారుచేస్తోంది. ఈ ఐపీఓ 2024 జనవరి 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. ధర శ్రేణి రూ.51-52గా నిర్ణయించారు.

Details

 టెక్నికెమ్ ఆర్గానిక్స్ 

రసాయనాల్ని తయారుచేసే టెక్నికెమ్ ఆర్గానిక్స్ ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఐపీఓకు రానుంది. ఈ సంస్థ రూ.25.25 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 31 నుంచి బిడ్లు దాఖలు చేయొచ్చు. ధర శ్రేణి రూ.52 -55గా నిర్ణయించారు. జనవరి 2న సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది. లిస్టింగ్‌లు మెయిన్‌ బోర్డ్‌ నుంచి కారారో ఇండియా, సెనోర్సో ఫార్మాస్యూటికల్స్‌, వెంటివ్‌ హాస్పిటల్స్‌ డిసెంబర్ 30న మార్కెట్లో లిస్ట్‌ కానున్నట్లు తెలిసింది. యూనిమెక్‌ ఏరోస్పేస్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ షేర్లు డిసెంబర్ 31న దలాల్‌ స్ట్రీట్‌లో అడుగుపెట్టనున్నాయి. ఎస్‌ఎంఈ కేటగిరీలో అన్యా పాలిటెక్‌ అండ్‌ ఫెర్టిలైజర్ లిమిటెడ్ షేర్లు జనవరి 2న, సిటీకెమ్‌ ఇండియా లిమిటెడ్ షేర్లు జనవరి 3న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.