Page Loader
Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్ 
Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్

Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 18, 2024
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌరవిమానయాన రంగంలోకి నూతనంగా అడుగుపెట్టిన 'ఆకాశ ఎయిర్‌ (Akasa Air)' తన సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే తాజాగా బడ్జెట్ క్యారియర్ అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్(150 Boeing 737 MAX) నారోబాడీ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ చర్య దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలలో ఎయిర్‌లైన్ పరిధిని విస్తరించడం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లో వ్యూహాత్మకంగా స్థానం సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో జరిగిన "వింగ్స్ ఇండియా 2024" కార్యక్రమంలో ఆకాసా ఎయిర్ ఈ ప్రకటన చేసింది.

Details 

త్వరలో అంతర్జాతీయ సర్వీసులు

అకాసా ఎయిర్ తాజా 150-విమానాల ఆర్డర్‌లో బోయింగ్ 737 MAX 10,737 MAX 8-200 జెట్‌ శ్రేణి విమానాల కోసం ఆర్డర్‌ చేసినట్లు పేర్కొంది. వివాదాస్పద Max 9 వేరియంట్ ఈ తాజా ఆర్డర్ ఇందులో లేదు. ప్రస్తుతం విమానయాన రంగంలో అకాసా ఎయిర్ మార్కెట్‌ వాటా 4శాతంగా ఉంది. దేశీయంగానే సేవలందిస్తున్న అకాసా ఎయిర్ సంస్థ.. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకు వీరికి గతేడాదే అనుమతులు లభించాయి.