Page Loader
Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు
రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు

Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్‌ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది. లాటరీ విధానం ద్వారా షేర్లు కేటాయించనున్నారు. దీనిని రిజిస్ట్రార్ పర్యవేక్షిస్తారు. ఈ ఐపీఓలో పెట్టుబడిదారులకు అప్పగించే షేర్ల సంఖ్య, వారి బిడ్స్‌కు అనుగుణంగా ఖరారవుతుంది. స్విగ్గీ IPO ముగిసే సమయానికి మూడున్నర రెట్లు మాత్రమే ఓవరాల్ సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. దీంతో మార్కెట్ నుండి మిశ్రమ స్పందన లభించింది. పెట్టుబడిదారులు తమ కేటాయింపు స్థితిని బీఎస్ఈ లేదా రిజిస్ట్రార్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయవచ్చు. బీఎస్ఈ వెబ్‌సైట్‌లో, 'Swiggy'ని సెలెక్ట్ చేసి, తమ అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

Details

నవంబర్ 13న లిఫ్టింగ్

మరోవైపు Link Intime India వెబ్‌సైట్‌లో 'Swiggy IPO' సెలెక్ట్ చేసి, పాన్ వివరాలను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే కేటాయింపు వివరాలు తెలుస్తాయి. స్విగ్గీ షేర్లు నవంబర్ 13న స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌ అవుతాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.5,704 కోట్లుగా ఉన్న రెవెన్యూను FY24లో రూ.11,247 కోట్లకు పెంచుకున్నప్పటికీ, సంస్థ ప్రతి ఏడాది నష్టాలను నమోదు చేస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్విగ్గీ నికర నష్టం రూ.2,350 కోట్లుగా ఉంది. ఈ నిధులను నాలుగు నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో సంస్థ వ్యాపార విస్తరణకు వినియోగించనుంది.