Page Loader
Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు

Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 25, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కృత్రిమ మేధపై మెగా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెజాన్‌ దాదాపుగా 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను (భారత కరెన్సీలో దాదాపు రూ.33.24 వేల కోట్లు) ప్రకటించింది. ఈ మొత్తం నిధులతో ఆంత్రోపిక్‌ అనే స్టార్టప్ సంస్థలో మైనారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. భవిష్యత్ లో ఏఐ(ARTIFICIAL INTELLIGENCE) వినియోగం పెరగనుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు భారీ పెట్టుబడులను పారిస్తున్నాయి. ఫలితంగా నవతరం సాంకేతికతలోని అద్భుత అవకాశాలను ఒడిసిపట్టేందుకు ఆరాట పడుతున్నాయి.

DETAILS

ఆంత్రోపిక్‌ ను వారే ప్రారంభించారు

బ్లాగ్‌ పోస్ట్‌లు, డిజిటల్‌ పుస్తకాలు, శాస్త్రసాంకేతికత వ్యాసాలు, పాప్ గీతాలు, టెక్ట్స్‌, చిత్రాలు, వీడియోలతో పాటు మనిషి పనికి సంబంధించి ప్రతి అంశంపైనా ఈ మోడల్స్‌కు శిక్షణ అందించనున్నారు. తాజాగా జరిగిన ఒప్పందంలో భాగంగా ఆంత్రోపిక్‌ ప్రాథమిక క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌గా అమెజాన్‌ను ఉపయోగించనుంది. మరోవైపు ఈ-కామర్స్‌లోని కస్టమ్‌ చిప్స్‌ ద్వారా 'జనరేటివ్‌ ఏఐ సిస్టమ్స్‌ (generative AI systems)'కు శిక్షణ ఇవ్వనున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఆంత్రోపిక్‌ ను చాట్‌జీపీటీ (ChatGPT)ని తయారు చేసిన ఓపెన్‌ ఏఐలో పనిచేసిన మాజీ ఉద్యోగులు ప్రారంభించడం విశేషం. ఇప్పటికే చాట్‌జీపీటీ (ChatGPT)కి పోటీగా క్లాడ్‌ (Claude), చాట్‌బాట్‌ను తెచ్చింది. ఓపెన్‌ ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 2019లోనే 1 బి.డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.