LOADING...
Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర

Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు కోరుకునే వారికి శుభవార్త. పసిడి ధరల్లో ఒక్కరోజులో భారీగా తగ్గుదల కనిపించింది. తాజాగా హైదరాబాదు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు క్షీణించాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల పసిడి తులం ధర ఏకంగా రూ.1,630 తగ్గింది. దీంతో ఇది ప్రస్తుతం రూ.97,970కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 తగ్గి రూ.89,800 వద్ద ట్రేడ్ అవుతోంది.

Details

గ్రామువారీ ధరల వివరాలు (హైదరాబాద్‌లో) 

24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) - రూ.9,797 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) - రూ.8,980 ఈ ధరలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. అంతేకాదు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,950 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.98,120 వద్ద ట్రేడ్ అవుతోంది.

Details

వెండి ధరలు మాత్రం స్థిరంగా 

హైదరాబాద్‌లో కిలో వెండి ధర యథాతథంగా రూ.1,18,000 వద్ద కొనసాగుతోంది. కానీ ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ.2,000 పెరిగి ప్రస్తుతం రూ.1,07,000 వద్ద ఉంది. మొత్తంగా చెప్పాలంటే.. బంగారం ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల గోల్డ్ కొనుగోలుదారులకు నిజంగా అనుకూల పరిణామం. తాజా ధరలతో మరోసారి గోల్డ్ మార్కెట్ చురుకుదనం సాధించే అవకాశం కనిపిస్తోంది.