LOADING...
PM Modi: ట్రంప్ 50% సుంకాలు అమలుకు ఒక్క రోజు ముందు.. రేపు పీఎంఓలో కీలక భేటీ..!   
ట్రంప్ 50% సుంకాలు అమలుకు ఒక్క రోజు ముందు.. రేపు పీఎంఓలో కీలక భేటీ..!

PM Modi: ట్రంప్ 50% సుంకాలు అమలుకు ఒక్క రోజు ముందు.. రేపు పీఎంఓలో కీలక భేటీ..!   

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో 50 శాతం టారిఫ్‌లు విధించారు. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం వల్ల భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో,టారిఫ్‌లు అమల్లోకి రాకముందు రోజు అంటే ఆగస్టు 26న (మంగళవారం) ప్రధాన మంత్రి కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతులు ఎదుర్కొనే సమస్యలు,ఆర్థిక ప్రభావం,పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయ(PMO)ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఇందులో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు పీఎంఓలో కీలక భేటీ..!