తదుపరి వార్తా కథనం

Gold Rates: వినియోగదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2025
02:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం మళ్లీ ఒక్కసారిగా పెరగడం వల్ల వినియోగదారులకు షాక్ తగిలింది. ప్రపంచ రాజకీయ వాతావరణంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో బంగారం ధరలు తిరిగి ఎగబాకాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,530 పెరిగి రూ.1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,400 పెరిగి రూ.92,900కు చేరుకుంది.
Details
వెండి ధరలు తగ్గింపు
18 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,140 పెరిగి రూ.76,010 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే, వెండి ధరలు మాత్రం కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,13,000గా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు ప్రాత ప్రాంతాలపై ఆధారపడి మారుతూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.