BigBasket: బిగ్‌బాస్కెట్ ఐపీఓకి సిద్ధం.. త్వరలో క్విక్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ (BigBasket) పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని యోచిస్తోంది.
టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ నిత్యావసర వస్తువుల నుంచి యాపిల్ ఐఫోన్ల వరకు అనేక ఉత్పత్తులను తక్కువ సమయంలో డెలివరీ చేస్తోంది.
క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి, బిజినెస్ విస్తరణను వేగవంతం చేసేందుకు కంపెనీ ఐపీఓ చేపట్టాలని చూస్తోంది.
Details
2026 నాటికి రెట్టింపు వ్యాపారమే లక్ష్యం
2026 మార్చి నాటికి తన వ్యాపారాన్ని రెట్టింపు చేసేందుకు బిగ్‌బాస్కెట్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రస్తుతం 35 నగరాల్లో అందిస్తున్న సేవలను వచ్చే ఏడాది నాటికి 70కి పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే 18 నుంచి 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూకి (IPO) వెళ్లే అవకాశముందని కంపెనీ సీఈఓ హరిమీనన్ వెల్లడించారు.
ముంబయిలో జరిగిన రిటైల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వివరాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.
క్విక్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశం
త్వరలో క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టాలని బిగ్‌బాస్కెట్ యోచిస్తోంది. అయితే ఈ సేవలను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.
Details
క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ
దేశీయ క్విక్ కామర్స్ రంగం రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్, జొమాటో-బ్లింకిట్ వంటి సంస్థలు ప్రధాన నగరాల్లో 10 నిమిషాల్లో డెలివరీ అందిస్తూ ఈ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.
ఈ పోటీలో నిలిచేందుకు బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫార్మా ప్రొడక్ట్స్, ఫ్యాషన్ విభాగాలలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
క్విక్ ఫుడ్ డెలివరీ పోటీ పెరుగుతోంది
జొమాటో 'బిస్ట్రో', స్విగ్గీ 'బోల్ట్', జెఫ్‌టో 'జెప్టో కేఫ్' వంటి ప్లాట్‌ఫామ్‌లు కేవలం 10 నిమిషాల్లో ఆహారాన్ని డెలివరీ చేయడం ప్రారంభించాయి.
ఈ విభాగంలో కూడా బిగ్‌బాస్కెట్ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశముంది.
ఇప్పటికే బిగ్‌బాస్కెట్ క్విక్ కామర్స్ విభాగంలో తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు బలమైన వ్యూహాలు రచిస్తోంది.