Bill Gates: "ఆమె నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్".. పౌలా హర్డ్‌తో రిలేషన్‌షిప్‌పై బిల్ గేట్స్
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తన వ్యక్తిగత జీవితాన్ని గురించి వెల్లడించారు.
ప్రస్తుతం పాలా హర్డ్‌తో సంబంధంలో ఉన్నట్లు చెప్పిన ఆయన, ఆమె తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని పేర్కొన్నారు.
''ఆమె వంటి వ్యక్తిని కలవడం నా అదృష్టం. మేమిద్దరం కలిసి టోర్నీలకు వెళ్తుంటాం, కలిసి పనులు చేసుకుంటాం'' అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బిల్ గేట్స్ (67) 2021లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ (Melinda French Gates)తో విడాకులు తీసుకున్నారు.
పాలా హర్డ్ (60) భర్త,ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు.
పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.2022 నుంచి గేట్స్, పాలా హర్డ్ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వివరాలు
బిల్ గేట్స్ 'సోర్స్ కోడ్ - మై బిగినింగ్స్' పుస్తకం
2024లో ఒలింపిక్స్‌ను వీక్షించినప్పుడు వీరి రిలేషన్‌షిప్ గురించి వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తన భాగస్వామి గురించి బిల్ గేట్స్ స్పష్టత ఇచ్చారు.
అలాగే, బిల్ గేట్స్ 'సోర్స్ కోడ్ - మై బిగినింగ్స్' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు.
ఈ పుస్తకంలో తన చిన్ననాటి జీవితంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు.
చిన్నప్పుడే గేట్స్ ఆటిజంతో బాధపడేవారని, కానీ అందుకు సరైన వైద్యం ఏదీ తమ తల్లిదండ్రులకు తెలియదని చెప్పారు.
తల్లిదండ్రులు అతన్ని సాధారణ బాలుడిగా మారుస్తేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన పరిస్థితులను ఈ పుస్తకంలో వివరించారు.
వివరాలు
వాల్యూమ్-1లో చిన్ననాటి అనుభవాలు, డ్రగ్‌లతో చేసిన ప్రయోగాలు
తాను యువకుడిగా ఉన్నప్పుడు అనేక ప్రయోగాలు చేశానని, అమ్మాయిలను ఆకర్షించేందుకు నిషేధిత డ్రగ్ ఎల్‌ఎస్‌డీ (LSD)ను కూడా రుచి చూశానని గేట్స్ తెలిపారు.
తన స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.
'సోర్స్ కోడ్'ను మూడు భాగాలుగా తీసుకొస్తున్నారు. వాల్యూమ్-1లో చిన్ననాటి అనుభవాలు, డ్రగ్‌లతో చేసిన ప్రయోగాలను మాత్రమే ప్రస్తావించారు.
తన ఉద్యోగ జీవితం, మైక్రోసాఫ్ట్‌లో ప్రయాణం, మెలిందా గేట్స్‌తో వివాహం, దాతృత్వ కార్యక్రమాలకు ఈ పుస్తకంలో ప్రస్తానం కల్పించలేదు.
భవిష్యత్‌లో విడుదలయ్యే ఇతర పుస్తకాలలో వాటి గురించి వివరించే అవకాశం ఉంది.