Page Loader
Bitcoin : ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ 95,000 డాలర్లను దాటింది!
ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ 95,000 డాలర్లను దాటింది!

Bitcoin : ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ 95,000 డాలర్లను దాటింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యాన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటల్‌గా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో వ్యూహాత్మక క్రిప్టో నిల్వలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించడంతో, బిట్‌ కాయిన్ సహా పలు క్రిప్టోకరెన్సీలు భారీగా పెరిగాయి. బెంచ్‌మార్క్ కాయిన్ అయిన బిట్‌కాయిన్ ఏకంగా 95,136 డాలర్లను తాకగా, అనంతరం 94,000 డాలర్ల వద్ద స్థిరపడింది ట్రంప్ ప్రకటనతో క్రిప్టోలకు బూస్ట్! కాయిన్‌మార్కెట్‌క్యాప్ డేటా ప్రకారం, ఆదివారం రాత్రి బిట్‌కాయిన్ ధర 95,136 డాలర్లకు చేరగా, ఆ తర్వాత 94,000 డాలర్ల స్థాయికి తగ్గింది. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ (ETH) ఏకంగా 13శాతం పెరిగి 2,516 డాలర్లకు చేరుకుంది.

Details

ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో ర్యాలీ 

మార్చి 2 ఉదయం 11:32 గంటల సమయంలో మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.87 ట్రిలియన్ డాలర్లకు చేరగా, మార్కెట్ వాల్యూమ్ 47 బిలియన్ డాలర్లను దాటింది. ట్రంప్ ప్రకటించిన క్రిప్టో రిజర్వ్‌లో ఎక్స్‌ఆర్‌పీ (XRP), సోలానా (SOL), కార్డానో (ADA) వంటి టోకెన్లు ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:55 గంటల సమయానికి, సోలానా (SOL) 24% పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్‌ఆర్‌పీ (XRP) 31% ఎగిసి 2.92 డాలర్లకు చేరింది. అంతకుముందు రోజుతో పోలిస్తే 33.14% పెరుగుదలతో 2.84 డాలర్లను తాకినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్ డేటా వెల్లడించింది. కార్డానో (ADA) 1.1 డాలర్లకు చేరుకుంది. క్రితం రోజుతో పోలిస్తే ఇది 0.64 డాలర్ల స్థాయి నుంచి భారీగా పెరిగింది.

Details

క్రిప్టో బూమ్! 

అమెరికాలో క్రిప్టో పరిశ్రమకు ఉత్సాహం అందించేందుకు ట్రంప్ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. బైడెన్ పరిపాలనలోని అవినీతి దాడుల తర్వాత, యూఎస్ క్రిప్టో రిజర్వ్ ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తుంది. అందుకే నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో వంటి క్రిప్టోలతో కూడిన స్ట్రాటజిక్ రిజర్వ్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్రెసిడెంట్ వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించానని ట్రంప్ 'ట్రూత్‌'లో పోస్ట్ చేశారు. అంతేకాదు బిట్‌కాయిన్ (BTC), ఈథర్ (ETH) వంటి క్రిప్టోకరెన్సీలు కూడా ఈ రిజర్వ్‌లో ఉంటాయి. తనకు బిట్‌కాయిన్, ఈథర్ అంటే ఇష్టమని స్పష్టం చేశారు.