Page Loader
Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌

Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రిప్టో కరెన్సీలలో ప్రముఖమైన బిట్‌కాయిన్‌ దూకుడు కొనసాగుతోంది. మొదటిసారిగా దీని ధర 1,11,000 అమెరికన్‌ డాలర్లను అధిగమించింది. బిట్‌కాయిన్‌ ఈ స్థాయికి చేరడంలో సంస్థాగత మదుపర్లు చూపిన ఆసక్తి, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌ వంటి కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీలను ఇంకా అధికారికంగా గుర్తించకపోయినా, ట్రంప్‌ మాత్రం వీటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం బిట్‌కాయిన్‌ విలువ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్ల వద్ద కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. అదే విధంగా, రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా ఉన్న ఈథర్‌ కూడా 7.3 శాతం మేర విలువ పెరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌