Page Loader
Blinkit: కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్‌ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు 
కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్‌ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు

Blinkit: కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్‌ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ (Blinkit) కొత్తగా ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం, నిర్దేశిత మొత్తానికి మించి చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. బ్లింకిట్‌లో రూ. 2,999 కంటే ఎక్కువ ఖర్చు చేసే వినియోగదారులు ఈ ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. అయితే, బంగారం,వెండి కొనుగోళ్లకు ఈ సదుపాయాన్ని వర్తింపజేయరు అని ఆయన తెలిపారు.

వివరాలు 

చెక్‌ఔట్‌ సమయంలో ఈఎంఐ ఆప్షన్‌

ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మొదట ఉత్పత్తులను కార్ట్‌లో యాడ్‌ చేసిన తర్వాత, చెక్‌ఔట్‌ సమయంలో ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చెల్లింపు పూర్తయిన తరువాత, ఆ మొత్తం బ్యాంక్‌ ద్వారా ఈఎంఐగా మారుస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న వారు ఈ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 3, 6, 9 నెలల కాల వ్యవధులలో వడ్డీ రేటు బ్యాంక్‌కు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.