
Warren Buffett: బెర్క్‌షైర్‌కు గుడ్‌బై చెప్పనున్న బఫెట్.. ఈ ఏడాదే పదవీ విరమణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి దిగ్గజం వారెన్ బఫెట్ త్వరలో తన కీలక బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నారు.
బెర్క్‌షైర్ హత్‌వే సంస్థలో ఆయన పదవీ విరమణకు సంబంధించిన ప్రణాళికలను అధికారికంగా ప్రకటించారు.
2025 చివరికి సీఈవో పదవికి గుడ్‌బై చెబుతానని ఆయన శనివారం నిర్వహించిన వార్షిక వాటాదారుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా బఫెట్ సంస్థ భవిష్యత్ నేతృత్వంపై కూడా స్పష్టతనిచ్చారు.
తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ బెర్క్‌షైర్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించగా, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) గ్రెగ్ అబెల్ నియమితులు కానున్నారు.
Details
అతనిపై పూర్తి నమ్మకం ఉంది
ఈ నిర్ణయాలన్నింటినీ బఫెట్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే ముందుగా తెలియజేశారని, గ్రెగ్‌కు కూడా ముందుగా ఈ సమాచారం తెలియదని బఫెట్ స్పష్టం చేశారు.
బెర్క్‌షైర్‌ను భవిష్యత్‌లో అబెల్ సక్రమంగా నడిపగలడా అనే విషయంలో కొంతమంది పెట్టుబడిదారులు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, తనకు మాత్రం అతనిపై పూర్తి నమ్మకం ఉందని బఫెట్ స్పష్టం చేశారు.
తన సొంత సంపదను కంపెనీలోనే పెట్టుబడిగా ఉంచుతానని, అబెల్ నాయకత్వంలో బెర్క్‌షైర్‌కు ఇంకా మెరుగైన అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.