Enviro Infra Listing:ఎన్విరో ఇన్‌ఫ్రా IPO వాటాదారులకు బంపర్ లాభాలు; 49% ప్రీమియంతో లిస్టింగ్
సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఇటీవల దలాల్ స్ట్రీట్ (స్టాక్ మార్కెట్)లో తమను పరిచయం చేసుకుంది. శుక్రవారం ఈ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.148 ఉన్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఈ (NSE)లో 48.65% ప్రీమియంతో రూ.220 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. అలాగే, బీఎస్‌ఈ (BSE)లో కూడా 47.3% లాభంతో రూ.218 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇటీవల ముగిసిన ఐపీఓకి అద్భుతమైన స్పందన వచ్చింది.
రిటైల్ పోర్షన్ 24.48 రెట్లు సబ్‌స్క్రైబ్
నవంబర్ 26తో ఐపీఓ ముగిసింది, ఇందులో మొత్తం 89.90 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది. కంపెనీ మొత్తం 3 కోట్ల షేర్లను మార్కెట్లో లభ్యముచేసింది, కాగా బిడ్లు రూ.276 కోట్ల విలువైన షేర్లకు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 157.05 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 153.80 రెట్లు, రిటైల్ పోర్షన్ 24.48 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఇప్పటికే రూ.195 కోట్లు సమీకరించబడిన విషయం తెలిసిందే. రూ.650 కోట్ల ఐపీఓలో భాగంగా ధర శ్రేణిని రూ.140-148 మధ్యగా నిర్ణయించారు.
ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ మేనేజర్‌గా హోమ్ సెక్యూరిటీస్
3.87 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా జారీ చేయగా, ప్రమోటర్లు 52.68 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ మూలధన అవసరాలు, రుణాల చెల్లింపులు, అనుబంధ సంస్థ ఈఐఈఎల్ మధుర ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ లో పెట్టుబడులకు, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎన్విరో సంస్థ వాటర్,వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సేవలను అందిస్తోంది. హోమ్ సెక్యూరిటీస్ సంస్థ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ మేనేజర్‌గా పని చేసింది.