Page Loader
Reliance: రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు
రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు

Reliance: రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మేజర్‌ మీడియా అసెట్స్‌ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దాదాపు రెండు నెలల తర్వాత ఆమోదముద్ర వేసింది. ఈ విలీన ప్రతిపాదనకు సంబంధించి సీసీఐ కొన్ని కీలక షరతులు విధించడం గమనార్హం. మంగళవారం సీసీఐ 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది. సీసీఐ ఆమోదం పొందిన ప్రకారం, ఇరు సంస్థలు తమ మీడియా పోర్ట్‌ఫోలియోలోని ఏడు టీవీ చానళ్లను విక్రయించాల్సి ఉంటుంది. వాటిలో స్టార్‌ జల్సా మూవీస్, కలర్స్‌ మరాఠీ, హంగామా వంటి ఛానళ్లు ప్రసిద్ధి చెందాయి.

Details

క్రికెట్ ఈవెంట్లకు ప్రత్యేక నిబంధనలు

ప్రసార హక్కులకు సంబంధించిన కొన్ని నియంత్రణలను కూడా సీసీఐ విధించింది. క్రికెట్‌ ఈవెంట్లలో ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి ప్రధాన మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార్‌ భారతితో పంచుకోవాలని ఇరు సంస్థలకు సూచన జారీ చేసింది. అలాగే, క్రికెట్‌ ఈవెంట్ల ప్రసారంలో అడ్వర్టైజ్‌మెంట్‌ స్లాట్లను బండిల్డ్‌ విధానంలో విక్రయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు, అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (స్టార్‌ ద్వారా), జియోసినిమా (వయాకామ్‌ 18 ద్వారా) వేర్వేరు ప్లాట్‌ఫాంలుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని సీసీఐ స్పష్టం చేసింది.