
Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది.
ఈ పెంపుతో ఇంధన ధరలు మరింత భారం కలిగించనున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం,ఈ పెరిగిన రేట్లు ఏప్రిల్ 8, 2025 నుంచే అమల్లోకి రానున్నాయి.
అంటే, ఈ రోజు అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలవుతాయి. అమెరికా విధించిన పరస్పర సుంకాల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భయాలు నెలకొన్నప్పటికీ,ప్రస్తుతానికి ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్
Central Government raises excise duty by Rs 2 each on petrol and diesel: Department of Revenue notification pic.twitter.com/WjOiv1E9ch
— ANI (@ANI) April 7, 2025
వివరాలు
సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదు
ఇప్పటికే ద్రవ్యోల్బణ భారంతో బాధపడుతున్న సామాన్య ప్రజలపై ఈ ఇంధన ధరల పెంపు మరింత ఆర్థిక ఒత్తిడిని కలిగించనుంది.
పైగా, ఈ పెంపు పరోక్షంగా వివిధ రంగాలపై ప్రభావం చూపించనుంది.
అమెరికా విధించిన పరస్పర సుంకాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం నెలకొన ఆందోళనల మధ్య, ముడి చమురు ధరలు తక్కువవుతున్న తరుణంలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఈ పెంపు కారణంగా సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
పెరిగిన ఖర్చును ఆయిల్ కంపెనీలే భరిస్తాయని, ప్రజలపై ఎటువంటి భాధ్యత లేదని తేల్చి చెప్పింది.