
China: అమెరికా దిగుమతులపై చైనా అదనంగా 34% సుంకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో తాము వెనుకడుగు వేయబోమని చైనా (China) స్పష్టమైన సంకేతాలు పంపించింది.
తాజాగా, వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ టారిఫ్‌లు అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై వర్తిస్తాయని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది.
ఈ నూతన నిర్ణయం ఏప్రిల్ 10 నుండి అమల్లోకి రానుందని తెలిపింది.
వాషింగ్టన్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ, అమెరికా ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది.
వివరాలు
కొత్త టారిఫ్‌ల ప్రభావం
"చైనాలోని టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా దిగుమతులపై ఏప్రిల్ 10 నుంచి అదనపు సుంకాలు విధిస్తున్నాం" అని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ ప్రకటించింది.
ఈ నిర్ణయంతో అమెరికా దిగుమతులపై ఇప్పటికే ఉన్న పన్నులకు తోడు కొత్త టారిఫ్‌లు కూడా వర్తిస్తాయి.
అయితే, ఇప్పటికే అమలులో ఉన్న పన్ను మినహాయింపు పాలసీలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది.
అదనంగా, మార్గమధ్యలో ఉన్న వస్తువులు మే 13 లోపు చేరుకుంటే, అవి ఈ కొత్త టారిఫ్‌ల నుంచి మినహాయింపును పొందనున్నాయి.
వివరాలు
ట్రంప్ నిర్ణయంపై బీజింగ్ ప్రతిస్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 34% అదనపు సుంకాలను విధించడంపై బీజింగ్ తీవ్రంగా స్పందించింది.
"మేము తగిన విధంగా ప్రతిస్పందిస్తాం" అని పేర్కొంది. ప్రతి సంవత్సరం 438 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాణిజ్య చర్చలపై చైనా వైఖరి
అమెరికాతో వాణిజ్య సంబంధాలపై చైనా స్పందిస్తూ, "మేము వాణిజ్య ఆందోళనలపై వాషింగ్టన్‌తో టచ్‌లో ఉన్నాం. సమ హోదాలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం" అని బీజింగ్ ప్రకటించింది.
వివరాలు
వాణిజ్య చర్చలపై చైనా వైఖరి
"చైనా సహా పలు దేశాలపై అమెరికా పరస్పర సుంకాలను విధిస్తోంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాదు, నిబంధనల ఆధారంగా పనిచేసే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను పట్టించుకోవడం లేదు. మా దేశ ప్రయోజనాలను రక్షించుకోవడానికి మేము తగిన చర్యలు తీసుకుంటాం" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా-చైనా వాణిజ్య గణాంకాలు
ఆసియాన్ (ASEAN), ఐరోపా సమాఖ్య (EU) తరువాత, అత్యధికంగా చైనా ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి.
2024 సంవత్సరానికి అమెరికా-చైనా మధ్య మొత్తం వాణిజ్యం విలువ 582.4 బిలియన్ డాలర్లు.
ఇందులో 143.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది.