Page Loader
80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  
80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్

80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లో సోమవారం ఉదయం భారీగా పతనం అయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న ఎవర్‌గ్రాండ్‌.. ఆదివారం మరో 4.5 బిలియన్‌ డాలర్లు (రూ.37 వేల కోట్ల) నష్టాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో అంతకముందుతో పోలిస్తే నష్టాలు 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. నగదు పెంచడానికి కంపెనీ డైరెక్టర్లు పలు చర్యలు తీసుకోడంతో ఆదాయం 44 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అదే సమయంలో నగదు నిల్వలు 6.3శాతానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు భయపడ్డారు. అదే సమయంలో దీని ఎలక్ట్రానిక్‌ వాహన విభాగం కూడా నష్టాలను ప్రకటించింది.ఈ కంపెనీ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్లో సోమవారం 80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

Details 

17 నెలల తర్వాత  ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌

అంతకముందు మూడేళ్లతో పోల్చుకొంటే తాజాగా ఆ కంపెనీ షేరు విలువలో 99 శాతం కోల్పోయినట్లైంది. అంతకముందు సంవత్సరం మార్చి నుంచి ఈ కంపెనీ షేర్లను ట్రేడింగ్‌ నుండి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే కంపెనీ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతిలభించడంతో 17 నెలల తర్వాత సోమవారం తిరిగి ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. గత మార్చిలో దీని విలువ 1.65 హాంకాంగ్‌ డాలర్లుగా ఉండేది. నేడు ట్రేడింగ్‌ను 0.22 డాలర్ల వద్ద మొదలుపెట్టింది. ఆ తర్వాత కొంచెం కోలుకొంది.నిజానికి చైనా,హాంకాంగ్‌ మార్కెట్లలో షేర్ల ట్రేడింగ్‌పై 0.1 శాతం పన్ను తగ్గించారు. ఇన్వెస్టర్లను ఎంకరేజ్ చెయ్యడానికే ఈ రకంగా చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్యతో చైనా, హాంకాంగ్‌ సూచీలు నేడు మంచి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.