Page Loader
Clear Tax: క్లియర్ టాక్స్ AI అసిస్టెంట్ టెక్నాలజీతో.. తెలుగులోనూ ట్యాక్స్‌ ఫైలింగ్‌..  
క్లియర్ టాక్స్ AI అసిస్టెంట్ టెక్నాలజీతో.. తెలుగులోనూ ట్యాక్స్‌ ఫైలింగ్‌..

Clear Tax: క్లియర్ టాక్స్ AI అసిస్టెంట్ టెక్నాలజీతో.. తెలుగులోనూ ట్యాక్స్‌ ఫైలింగ్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిన్‌టెక్ రంగంలోని ప్రముఖ సంస్థ క్లియర్‌ట్యాక్స్ తాజాగా వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు ఫైల్ చేయడంలో భాషా సమస్యలను తొలగించేందుకు అడుగులు వేసింది. సంస్థ అభివృద్ధి చేసిన కొత్త కృత్రిమ మేధ(ఏఐ)టూల్ ద్వారా,వాడుకదారులు తెలుగు సహా మొత్తం ఏడుసార్లు భాషల్లో సహాయం పొందగలుగుతారు. ఈ క్లియర్‌ట్యాక్స్‌ ఏఐ అసిస్టెంట్‌ను వాట్సాప్,స్లాక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వాడుతూ, తాము మాట్లాడే భాషలో చాటింగ్ చేయగలుగుతారు. ఫలితంగా,మూడు నిమిషాల్లోనే ఐటీ రిటర్న్ దాఖలు చేయడం సాధ్యమవుతుందని సంస్థ తెలిపింది. మధ్యవర్తులు లేకుండానే వ్యక్తులు తాము స్వయంగా రిటర్న్ ఫైల్ చేయడంలో ఇది మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది. ఈ కొత్త సదుపాయంతో ఒక కోటి కొత్త ట్యాక్స్ ఫైలర్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు క్లియర్‌ట్యాక్స్ పేర్కొంది.

vivaralu

కొత్త ఐటీ రిటర్న్ నిబంధనలపై పూర్తి అవగాహన అవసరం 

1. భారీ జరిమానాలు విధించవచ్చు ఐటీ రిటర్నును తప్పుడు సమాచారం ఆధారంగా దాఖలు చేసిన వారికి కఠినమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పన్ను అధికారుల నిర్ణయం మేరకు 200 శాతం వరకు జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, అంతేకాకుండా ఐటీ చట్టంలోని సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. 2. పన్ను చెల్లింపుదారుడికి పూర్తి బాధ్యత ఐటీ రిటర్న్ లో పొరపాట్లు కన్సల్టెంట్ లేదా సీఏ వలన జరిగినా, చట్టపరంగా తుది బాధ్యత పన్ను చెల్లింపుదారిదే. అందువల్ల జాగ్రత్త అవసరం. 3. ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి ఉద్యోగస్తులు, ఫ్రీలాన్సర్లు,వ్యాపారులు, ప్రొఫెషనల్స్ - ఏ వర్గానికి చెందిన వారు అయినా, ఈ నియమాలు అందరికి వర్తిస్తాయి.

వివరాలు 

4. సాధారణంగా జరిగే తప్పులు 

సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ను ఎంచుకోకపోవడం, అనవసర మినహాయింపులను క్లెయిమ్ చేయడం, సంపాదన వివరాలను గోప్యతలో ఉంచడం - ఇవన్నీ జరిమానాలకు దారితీసే అంశాలే. 5. రివైజ్డ్ రిటర్న్‌ వల్ల ప్రయోజనం ఉండదు ఒకవేళ ఐటీ శాఖ మీరు ఇచ్చిన వివరాలు తప్పని నిర్ధారించితే, ఆ తర్వాత రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసినా, జరిమానా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. 6. సరైన ఐటీఆర్‌ ఫారమ్‌ ఎంచుకోవాలి సాధారణ వేతన ఆదాయానికి ITR-1, వ్యాపార ఆదాయానికి ITR-3 వంటి భిన్నమైన ఫార్ముల్ని మీ ఆదాయ రకానికి తగినట్లు ఉపయోగించాలి.

వివరాలు 

7.తప్పుడు క్లెయిమ్‌లు చేయడం తప్పు 

వ్యక్తిగత ఖర్చులను వ్యాపార ఖర్చులుగా చూపించడం, అర్హత లేకపోయినా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) క్లెయిమ్ చేయడం వంటి పనులు జరిమానాలకే దారి తీస్తాయి. 8. పన్ను చెల్లింపుదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు వార్షిక సమాచార ప్రకటన (Annual Information Statement) వివరాలను సరిచూడడం, ఖచ్చితమైన లెక్కలు ఉంచడం, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాల అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.