415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు
FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు. FTX నవంబర్ 2022లో దివాలా కోసం దాఖలు చేశాక సుమారు $5.5 బిలియన్ల వరకు లిక్విడ్ ఆస్తులను తిరిగి పొందింది. "లిక్విడ్"ఆస్తి అంటే విలువ దెబ్బతినకుండా నగదుగా మార్చే అవకాశం. ఇందులో $0.3 బిలియన్ విలువైన సెక్యూరిటీలు, $1.7 బిలియన్ నగదు, $3.5 బిలియన్ క్రిప్టో ఆస్తులు ఉన్నాయి. ఇందులో USలో $181 మిలియన్ల విలువైన డిజిటల్ ఆస్తులను కూడా గుర్తించారు.
దివాలా కోసం దాఖలు చేసినప్పుడు నిధుల దుర్వినియోగంపై పుకార్లు వచ్చాయి
Alameda రీసెర్చ్ FTX స్థానిక నాణెం FTTపై ఆధారపడి ఉందని చూపించే బ్యాలెన్స్ షీట్‌ను ప్రచురించినప్పుడు దాని పతనం ప్రారంభమైంది. మొదట ప్రత్యర్థి సంస్థ బినాన్స్ కొనుగోలు ప్రతిపాదనను అందించింది, అయితే FTX చుట్టూ వివాదం పెరగడం ప్రారంభించిగానే వెనక్కి తగ్గింది. గత ఏడాది నవంబర్‌లో, దివాలా కోసం దాఖలు చేసినప్పుడు నిధుల దుర్వినియోగంపై పుకార్లు వచ్చాయి. రుణదాతలకు చెందిన నిధులు FTX నుండి Alameda రీసెర్చ్ కు దాని అప్పులను కవర్ చేయడానికి బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల మీద సహ వ్యవస్థాపకుడు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌ను డిసెంబర్ 2022లో బహామాస్‌లో అరెస్టు చేసి USకు అప్పగించారు. అతను ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.