Page Loader
Credit Card: నవంబర్‌లో క్రెడిట్ కార్డు వినియోగంలో క్షీణత.. 13% తగ్గిన వ్యయాలు
నవంబర్‌లో క్రెడిట్ కార్డు వినియోగంలో క్షీణత.. 13% తగ్గిన వ్యయాలు

Credit Card: నవంబర్‌లో క్రెడిట్ కార్డు వినియోగంలో క్షీణత.. 13% తగ్గిన వ్యయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండగ సీజన్‌ ముగియడంతో క్రెడిట్‌ కార్డు వ్యయాలు దేశీయంగా తగ్గాయి. అక్టోబర్‌లో రూ.2.02 లక్షల కోట్లతో రికార్డు స్థాయిని తాకిన క్రెడిట్ కార్డు చెల్లింపులు, తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నవంబర్ నాటికి వాటి విలువ రూ.1.70 లక్షల కోట్లకు చేరింది. ఇది 16.1 శాతం తగ్గుదల చూపిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పండగ సీజన్‌లో క్రెడిట్ కార్డ్ వినియోగం పెరిగినా ఆ తర్వాత అది తగ్గింది. నవంబర్‌లో క్రెడిట్ కార్డ్‌ ద్వారా జరిగే వ్యయం గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగింది. కానీ అక్టోబర్‌తో పోలిస్తే 13 శాతం తగ్గింది.

Details

17.5శాతం క్షీణించిన ఆన్‌లైన్ చెల్లింపులు

ఆఫ్‌లైన్ పాయింట్‌ ఆఫ్‌ సేల్ లావాదేవీలు 14 శాతం తగ్గి, ఆన్‌లైన్ చెల్లింపులు 17.5 శాతం క్షీణించాయి. విపణీకి సంబంధించిన బ్యాంకుల రికార్డులు చూస్తే నవంబర్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులలో 24 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 16.8 శాతం తగ్గుదల ఎదుర్కొన్నాయి. క్రెడిట్ కార్డుల జారీపై చూస్తే, ఎస్‌బీఐ 2,31,058 కార్డులను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1,87,118 కార్డులను, ఐసీఐసీఐ బ్యాంక్ 50,767 కార్డులను జారీ చేసింది. అయితే యాక్సిస్ బ్యాంక్ 39,734 కార్డులను కోల్పోయింది. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల జారీ మొత్తం 7,80,000గా ఉండగా, నవంబర్‌లో అది 3,50,000కు తగ్గింది, ఇది 73 శాతం క్షీణతను సూచిస్తుంది.