IPO: ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓ: మంచి గ్రోత్, ప్రైస్ బాండ్‌తో ఇన్వెస్టర్లకు ఆహ్వానం
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం మరో ఆసక్తికర ఐపీఓ రానుంది. వివిధ పండ్లు, కూరగాయల వ్యాధులను ఎదుర్కొనే అధిక సామర్థ్యవంతమైన విత్తనాల తయారీ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విక్రయాలలో ప్రత్యేకత కలిగిన ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ లిమిటెడ్, డిసెంబర్ 09, 2024 నుండి ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించనుంది. ఈ ఐపీఓ డిసెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.23.80 సమీకరణమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేర్ 52 -55గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 2000 షేర్లు అవసరమని తెలిపింది. లిస్టింగ్ తేదీ డిసెంబర్ 16, 2024 ప్రారంభించనుంది.
51% లిస్టింగ్ గెయిన్స్ సాధించే అవకాశం
కంపెనీ మొత్తం 43,28,000 ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తూ, సాధారణ కార్పొరేట్ అవసరాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అలాగే ఐపీఓకి సంబంధించిన ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించనుంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బైయర్లకు (QIB) 50%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35%, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15% కేటాయించింది. ప్రస్తుతం ఈ ఐపీఓకి జీఎంపీ 28గా ఉంది. ఇది 51% లిస్టింగ్ గెయిన్స్ సాధించే అవకాశాన్ని సూచిస్తోంది. మెనేజ్‌మెంట్, రిజిస్ట్రార్ ఈ ఐపీఓకి ఫిన్ షోర్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ లీడ్ మ్యానేజర్‌గా వ్యవహరిస్తుండగా, బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్‌గా ఉంది. ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓ పెట్టుబడిదారుల కోసం ఆకర్షణీయ అవకాశంగా కనిపిస్తోంది.