Diwali : రికార్డు స్థాయిలో దీపావళి అమ్మకాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీగా రీటైల్ కోనుగోళ్లు జరిగాయి. ఈ మేరకు కోనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ సంవత్సరం దీపావళి ఉత్సవాల సందర్భంగా భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు సంబంధించి కొత్త చరిత్ర నమోదైంది. చైనా దిగుమతుల కంటే స్థానికంగా, భారతదేశంలో తయారైన వస్తువులు, వాటి ఉత్పత్తి అమ్మకాలపై వ్యాపారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే రిటైల్ విక్రయాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 3.75 లక్షల కోట్లుగా నమోదైంది. అదనంగా రూ. 50,000 కోట్ల ఆదాయం సమకూరుతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) పేర్కొంది. 'భారతీయ ఉత్పాద్-సబ్కా ఉస్తాద్' పేరిట CAIT విస్తృతంగా ప్రచారం చేసింది.
భారీ వ్యాపారానికి ఊతం ఇచ్చిన లోకల్ ఫర్ వోకల్ కార్యక్రమం
భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన లోకల్ కోసం వోకల్ అనే కార్యక్రానికి తాజాగా వ్యాపారం ఊతం ఇస్తోంది. మరోవైపు ఇదే పండుగ సీజన్ లో భాగంగా చైనా మార్కెట్లోని వస్తువులు దాదాపుగా రూ.లక్ష కోట్లకుపైగా భారీ నష్టాలను చవిచూశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయా ,సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరాల్లో దీపావళి సమయంలో దేశీయ మార్కెట్‌లో చైనా వస్తువులే దాదాపు 70 శాతం మేర వాటా కలిగి ఉండేవాన్నారు. ఈ సంవత్సరం పండుగ సందర్భంగా మాత్రం దేశీయ వినియోగదారులు ప్రాధాన్యతలలో చెప్పుకోదగ్గ మార్పును గుర్తించామన్నారు.
13 శాతం ఖర్చు దేనికోసమో తెలుసో
వినియోగదారు ఖర్చుల మొత్తం కోనుగోళ్లలో 13 శాతం ఆహారం, కిరాణా వస్తువులకు, 9 శాతం నగలకు, 12 శాతం వస్త్రాలకు కేటాయించారని CAIT నివేదించింది. మరో 4 శాతం డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, సావరీస్, 3 శాతం గృహాలంకరణ కోసం , 6 శాతం సౌందర్య సాధనాలపై, 8 శాతం ఎలక్ట్రానిక్స్ కోసం ఖర్చు చేశారన్నారు. ప్రార్థన వస్తువులు, పాత్రలు, వంటగది ఉపకరణాలు, మిఠాయి, బేకరీ, బహుమతి వస్తువులు, ఫర్నిషింగ్, ఫర్నిచర్ వరుసగా 3%, 3%, 2%, 8% , 4% కలిగి ఉన్నాయి. మిగిలిన 20 శాతం ఆటోమొబైల్స్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్స్, బొమ్మలు సహా అనేక ఇతర వస్తువులు మరియు సేవలపై ఖర్చు చేశారని CAIT నివేదిక స్పష్టం చేసింది.