
USA: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలపై పన్నులు: అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం ఆటో మొబైల్, విడిభాగాలపై విధిస్తున్న పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం రక్షణాత్మక చర్యలుగా పరిగణించదగ్గవి కాదని అమెరికా స్పష్టం చేసింది. తన దేశ జాతీయ భద్రత దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ పన్నులను విధించినట్లు వాషింగ్టన్ పేర్కొంది. అందువల్ల, భారత్ ఈ పన్నులపై ప్రతీకార చర్యలుగా సుంకాలు విధించే అవకాశం లేదని వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారం అమెరికా డబ్ల్యూటీవోకు తెలియజేసింది. ''ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్‌లు రక్షణాత్మక చర్యలు కావు'' అని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది.
వివరాలు
2019లో కూడా భారత్ అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు
ఇంతకుముందు కూడా అమెరికా భారత్‌పై విమర్శలు చేసింది. డబ్ల్యూటీవో అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ ప్రకారం చేపట్టాల్సిన విధివిధానాలను భారత్ పాటించడం లేదని ఆరోపించింది. సెక్షన్ 232 టారిఫ్‌లను తాము రక్షణాత్మక చర్యలుగా పరిగణించనందున వాటిపై చర్చించబోమని అమెరికా వెల్లడించింది. అయితే భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. తమకు టారిఫ్‌లు విధించే హక్కు ఉన్నదని స్పష్టంగా తెలిపింది. అంతేకాక, అమెరికా విధించిన అదనపు పన్నుల కారణంగా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ, విడిభాగాల పరిశ్రమ నష్టపోతోందని పేర్కొంది. అందువల్ల కొన్ని రాయితీలపై సస్పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే అవి ఏయో మాత్రం బహిర్గతం చేయలేదు. 2019లో కూడా భారత్ అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
వివరాలు
ఈ నెల మొదట్లో భారత్ మరోసారి ప్రతీకార సుంకాల ప్రతిపాదన
ఇందులో బాదం, యాపిల్, రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ట్రంప్‌కు మద్దతుగా ఉన్న రైతులపై ఈ సుంకాల ప్రభావం పడేలా భారత్ వ్యూహాత్మకంగా ఆ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల మొదట్లో భారత్ మరోసారి ప్రతీకార సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే జూలై 10న వాటిని తిరిగి సమీక్షించింది. ఈసారి స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన టారిఫ్‌లను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలను రూపొందించింది. అమెరికా తొలుత స్టీల్, అల్యూమినియం, వాటి డెరివేటివ్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధించింది. తర్వాత 2025 జూన్ 3న ఈ పన్నును 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.