ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 7శాతం నమోదు అవుతుందని, 2021-22లో 8.7శాతం నమోదైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5శాతం వృద్ధి సాధించినా అది చాలా గొప్ప విషయమని చెప్పింది. అలాగే ద్రవ్యోల్బణాన్ని 11 శాతంగా అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా అనేక అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మారకపు రేటు పరంగా ఐదవ అతిపెద్దదని సర్వే వివరించింది.
రూపాయి పతనమైనా భారత్‌కు ఇబ్బంది లేదు: ఆర్థిక సర్వే
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో రూపాయి మారకం విలువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రూపాయి పతనమైనా, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు భారత్ వద్ద తగినన్ని మారక నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. కరోనాను నుంచి భారత వేగంగా కోలుకుంటోందని, దేశీయంగా డిమాండ్, క్యాపిటల్, పెట్టుబడులు, ప్రవేటు వినియోగం భారత వృద్ధిని మరింత బలోపేతం చేస్తున్నట్లు సర్వే వివరించింది.