Page Loader
Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు
ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు

Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని కూడా ఎక్స్ నుంచి తొలగించారు. సంస్థ ఎదుర్కొంటున్న పలు సవాళ్ల కారణంగా ప్రస్తుతం ఎక్స్‌ విలువ 9.4 బిలియన్‌ డాలర్లకు (సుమారు 79 వేల కోట్ల రూపాయలు) తగ్గింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ట్రూత్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ కంటే అధిక విలువ సాధించిందని నివేదికలు చెబుతున్నాయి.

Detals

డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రూత్ సోషల్‌ మీడియా 10 బిలియన్ డాలర్ల (సుమారు 84 వేల కోట్ల రూపాయలు)తో ఎక్స్‌ను దాటి ముందంజలో ఉన్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ఫిడిలిటీ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.