English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Pension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!
    తదుపరి వార్తా కథనం
    Pension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!
    80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త

    Pension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    07:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి వృద్ధాప్యంలో అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది.

    కానీ, వయసు పెరిగే కొద్దీ అవసరాలు, వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని సమయానుసారం పెంచుతూ ఉంటుంది.

    ఇటీవలి కాలంలో, కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు శుభవార్త అందించింది.

    80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

    ఈ మార్పులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 (పెన్షన్) ప్రకారం, 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

    వివరాలు 

    100 సంవత్సరాల వారికి డబుల్ పెన్షన్ 

    ఈ కొత్త నియమాల ప్రకారం, పెన్షనర్లకు వయసును బట్టి అదనపు పెన్షన్ అందించబడుతుంది.

    వయసు పెరిగేకొద్దీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. 80-85 ఏళ్ల మధ్య వయసున్న వారికి వారి బేసిక్ పెన్షన్‌లో 20%అదనంగా లభిస్తుంది.

    85-90 ఏళ్ల వయసున్న వారికి 30%,90-95 సంవత్సరాల వారికి 40%, 95-100 ఏళ్ల వయసున్న వారికి 50% అదనపు పెన్షన్ అందించబడుతుంది.

    100 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు ప్రస్తుత పెన్షన్ మొత్తానికి సమానమైన అదనపు మొత్తాన్ని ఇవ్వడం ద్వారా వారి పెన్షన్ మొత్తం రెట్టింపు(డబుల్)అవుతుంది.

    అక్టోబర్ 18న, రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం ప్రత్యేక ఆదేశాలను విడుదల చేసింది.

    ఇది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది,పెన్షన్,పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేయబడింది.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఎప్పుడు అమల్లోకి వస్తుంది? 

    పెన్షనర్లు కొత్త వయసు వర్గంలోకి ప్రవేశించిన నెల మొదటి తేదీ నుంచే వారికి అదనపు పెన్షన్ లభిస్తుంది.

    ఉదాహరణకు, ఒక పెన్షనర్ ఆగస్టు 20న 80 ఏళ్లు నిండితే, ఆగస్టు 1 నుంచే వారికి అదనంగా 20% పెన్షన్ అందించబడుతుంది.

    అదేవిధంగా, ఆగస్టు 1న 85 ఏళ్లు నిండిన వారికి 30% అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    మరొక శుభవార్త 

    అదనపు పెన్షన్‌తో పాటు, రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు క్రమం తప్పకుండా పెన్షన్ అందేలా అన్ని శాఖలు, బ్యాంకులు ఆదేశాలు జారీ చేశాయి.

    ఎక్కడ పనిచేసినా లేదా ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకున్నా, అందరికీ ఈ కొత్త నియమాలు వర్తిస్తాయి.

    కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 16న పెన్షనర్లకు DA 3% పెంచినట్లు ప్రకటించగా, రెండు రోజుల్లో మరోసారి పెన్షనర్లకు శుభవార్త అందించిందని చెప్పాలి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    కేంద్ర ప్రభుత్వం

    Pankaj Chaudhary: భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నియంత్రించే ప్రతిపాదన ఏదీ లేదు: పంకజ్ చౌదరి  టెక్నాలజీ
    Waqf Board: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఈ మార్పులు ఉండే అవకాశం  భారతదేశం
    #NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?  సుప్రీంకోర్టు
    PM-Surya Ghar: 'మోడల్ సోలార్ విలేజ్' కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025