
USA: భారత ఎగుమతులకు అమెరికా టారిఫ్‌ల ప్రభావం.. తగ్గిన భారత ఎగుమతులు..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్‌ల కారణంగా భారత వస్తువుల ధరలు అమెరికాలో భారీగా పెరిగిపోయి, పోటీ ఎదుర్కొనడం కూడా కష్టమవుతోంది. ఈ పరిస్థితిని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) సంస్థ స్పష్టంగా తెలియజేసింది. 2025 ఆగస్టులో అమెరికాకు భారత ఎగుమతులు 16.3 శాతానికి తగ్గి మొత్తం 6.7 బిలియన్ డాలర్లకు చేరాయి. టారిఫ్‌ల పెరుగుదల 50 శాతానికి చేరడం వలన ఒక్కసారిగా ఇంత భారీ తగ్గుదల నమోదైంది. ఈ తరుగుదల జూలై నెలలో కేవలం 3.6 శాతంగా ఉండగా, జూన్‌లో 5.7 శాతం తగ్గడం గమనార్హం.
వివరాలు
మే నెలకు ముందు ఉన్న ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే, మే నెలలో మాత్రమే అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. అప్పుడంటే 4.8 శాతం వృద్ధితో 8.8 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. మే నెలకు ముందు ఉన్న ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు మాత్రమే. జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజేయ్ శ్రీవాస్తవ ప్రకారం, "టారిఫ్‌లలో భారీ పెరుగుదల వల్లే ఈ ఎగుమతుల తరుగుదల వచ్చింది" అని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌లో ఈ దిగుబడి మరింత తీవ్రమవుతుందని, పూర్తి స్థాయిలో ప్రభావం తక్కువ రోజుల్లోనే స్పష్టమవుతుందని సూచించారు.
వివరాలు
భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫోన్లు, ఔషధాలకు మినహాయింపు
ముందుగా ఏప్రిల్ 4వ తేదీ వరకు భారత్ సరుకులు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో సులభంగా ఎగుమతి అయ్యాయి. తర్వాత ట్రంప్ అన్ని దేశాలకు 10శాతం పన్నులు విధించారు. ఆ సమయంలో వ్యాపార సంబంధాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించలేదు,అందుకే మే నెలలో కూడా ఎగుమతులు పెరిగాయి. కానీ తర్వాత మల్టిపుల్ దేశాలకుపై లక్ష్యంగా టారిఫ్‌లు అమలు చేయడం తీవ్ర ప్రతికూలతను కలిగించింది. ప్రత్యేకంగా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన 25 శాతం సుంకాలు,మళ్లీ మరో 25 శాతంతో భారత ఎగుమతులను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. అయితే,భారత ఫోన్లు,ఔషధ ఉత్పత్తులపై మాత్రం మినహాయింపులు వర్తించటం ఆనందాన్నిస్తుంది. అయినప్పటికీ,మొత్తం ఎగుమతుల తరుగుదల గమనించినట్టయితే, ఫోన్లు, ఔషధాలు కాకుండా మిగతా ఉత్పత్తులు అనుకున్నదానికన్నా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
వివరాలు
మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పుట్టినరోజు శుభాకాంక్షలు
లేబర్ ఆధారిత రంగాలలో దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్ ఉత్పత్తులు, రొయ్యలు, కార్పెట్లు వంటివి ఈ సంక్షోభం కారణంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నాయి. వీటిలో 30 నుంచి 60 శాతానికి మధ్య ఉత్పత్తులు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని అంచనా. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ టారిఫ్‌లు కొనసాగితే, భారత-అమెరికా వాణిజ్యంలో 30-35 బిలియన్ డాలర్ల వరకు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయనే సంకేతాలను పంపుతున్నాయి.