LOADING...
Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?

Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్‌లు వైరల్ అవుతుంటాయి. వాటిలో నిజమెంతో తెలియకుండానే చాలామంది వాటిని నమ్ముతూ,ఆ వార్తలను మరింతగా షేర్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజలు అయోమయంలో పడడం,అపోహలకు లోనవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల జోక్యం అవసరమవుతుంది. వారు ముందుకు వచ్చి అసత్య వార్తలను ఖండించి, నిజం ఏంటనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఇటీవల రూ.500 నోట్లపై వస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు మార్కెట్‌లో నిలిపివేస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దీనిపై అధికారికంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక ట్వీట్‌ను జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పీఐబీ ఫ్యాక్ట్ చెక్  చేసిన ట్వీట్ 

వివరాలు 

 పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ 

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చి వరకు క్రమంగా నిలిపివేస్తారన్న వార్త పూర్తిగా అసత్యమని పీఐబీ స్పష్టం చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఆర్బీఐ ఈ నోట్లను 2026 మార్చి నాటికి నిలిపేస్తుందని ప్రచారం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ దుష్ప్రచారాన్ని తప్పుపడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికతో పాటు, ఎక్స్ ప్లాట్‌ఫాంలో ఒక స్పష్టమైన పోస్టును పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ ఇటువంటి ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది.

వివరాలు 

ఫేక్ వార్తలను ప్రజలు నమ్మకండి 

రూ.500 నోట్లను చట్టబద్ధంగా చలామణిలో ఉంచుతున్నట్టు కేంద్రం స్పష్టంగా తెలిపింది. అవి ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే నోట్లేనని, వాటిని నిలిపివేస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం లేదని వివరించింది. సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు పెరుగుతున్నప్పటికీ, ఇలాంటి ఫేక్ వార్తలపై ప్రజలు నమ్మకుండాల్సిందిగా సూచించింది. అదేవిధంగా, ఏదైనా ఆశ్చర్యకరమైన వార్తలు వచ్చినప్పుడు వాటిని నమ్మేముందు లేదా షేర్ చేయేముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరణ పొందాలని కోరింది.

వివరాలు 

రూ.500 నోట్ల విషయంలో అసత్య ప్రచారం

అయితే 2016లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన డీమానిటైజేషన్ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ప్రకటనతో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అయ్యాయి. అనంతరం కొత్త రూపంలో రూ.500 నోట్లు, రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రూ.500 నోట్లు విస్తృతంగా చలామణిలో ఉన్నప్పటికీ, రూ.2 వేల నోట్లు మాత్రం మార్కెట్లో కనిపించడంలేదు. ఎందుకంటే ఆ నోట్లను దశలవారీగా ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రూ.500 నోట్ల విషయంలోనూ అలాగే చేస్తారనే అసత్య ప్రచారం సోషల్ మీడియాలో పుట్టుకొస్తోంది.