NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Paytm Q2 Results:పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.. రూ.928 కోట్ల నికర లాభం
    తదుపరి వార్తా కథనం
    Paytm Q2 Results:పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.. రూ.928 కోట్ల నికర లాభం
    పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.

    Paytm Q2 Results:పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.. రూ.928 కోట్ల నికర లాభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పేటియం బ్రాండ్ పేరుతో పరిచయమైన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నష్టాల నుంచి తిరిగి తేరుకుంది.

    2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్లో, సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ అద్భుతమైన రీతిలో రూ.928.3 కోట్ల నికర లాభం సాధించింది.

    గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.290.5 కోట్ల నష్టాలను చవిచూసిన నేపథ్యంలో, లాభాల పథానికి తిరిగి రావడం విశేషం.

    వివరాలు 

    నష్టాల నుంచి తేరుకొని లాభాలు నమోదు

    కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 34.1 శాతం తగ్గి రూ.1659.5 కోట్లుగా నమోదు కాగా, నికర లాభం పెరిగేందుకు ప్రధాన కారణం ఉన్నట్లు పేటీఎం వెల్లడించింది.

    పేటీఎం సినిమాలు,ఈవెంట్ల టికెట్ల బుకింగ్ వ్యాపారాన్ని జొమాటోకు విక్రయించడం వల్లనే రూ.1345 కోట్ల లాభం వచ్చిన్నట్లు తెలిపింది.

    దీంతో, నష్టాల నుంచి తేరుకొని లాభాలు నమోదు చేసినట్లు స్పష్టం చేసింది.

    ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం ఆదాయం 9 శాతం పెరిగి రూ.376 కోట్లుగా నమోదు కాగా, పేటీఎం వ్యాపారం సేవల ఆదాయం 34 శాతం పెరిగి రూ.981 కోట్లుగా నమోదైంది.

    ఈ క్రమంలో, కంపెనీ ఖర్చులు 17 శాతం తగ్గి రూ.1080 కోట్లకు దిగివచ్చాయని వెల్లడించింది.

    వివరాలు 

    ఆర్‌బిఐ ఆంక్షల కారణంగా పేటీఎంకి ఆర్థిక ఇబ్బందులు

    క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత, పేటీఎం షేరు బీఎస్ఈలో 4.73 శాతం నష్టంతో రూ.692.15 వద్ద ముగిసింది.

    అలాగే, ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.78 శాతం నష్టంతో రూ.684 వద్ద స్థిరపడింది. అయితే, గత ఆరు నెలల్లో ఈ షేరు 81 శాతం మేర లాభం అందించిందని గమనించాలి.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) విధించిన ఆంక్షల కారణంగా పేటీఎం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

    దీనితో, షేరు ధర క్రమంగా పడిపోయింది. కంపెనీ వ్యాపారం కూడా నష్టాన్ని చవిచూసింది.

    ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోతో చర్చలు ప్రారంభించి, సినిమాలు, ఈవెంట్ల టికెట్ బుకింగ్ వ్యాపారాన్ని జొమాటాకు విక్రయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం
    జొమాటో

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ ప్లాన్
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం ప్రకటన
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  తాజా వార్తలు
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్

    జొమాటో

    ONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ స్విగ్గీ
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  కరెన్సీ
    ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ  స్నేహితుల దినోత్సవం
    ప్రముఖ డెలివరీ సంస్థ జోమాటో షేర్లకు రెక్కలు.. 5 శాతం పెరిగిన ధరలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025