LOADING...
CIBIL Score: మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం
మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం

CIBIL Score: మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మొదటిసారి రుణం కోరుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేవలం సిబిల్ స్కోర్ లేకపోవడం వలన వారి రుణ దరఖాస్తులు బ్యాంకులు తిరస్కరించరాదని స్పష్టంగా పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కొత్త రుణదారులు క్రెడిట్ హిస్టరీ లేకపోవడం వల్ల వాటిని నిరాకరించకూడదని ఆయన సూచించారు. "మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి క్రెడిట్ హిస్టరీ లేకపోవడం మాత్రమే కారణంగా బ్యాంకులు లేదా ఇతర రుణ సంస్థలు రుణాలను తిరస్కరించకూడదు. RBI ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది" అని ఆయన వివరించారు.

వివరాలు 

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తుది నిర్ణయం కాదు

రుణ మంజూరుకు RBI ఏ విధమైన కనీస క్రెడిట్ స్కోర్‌ను తప్పనిసరిగా నిర్దేశించలేదు అని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు తమ స్వంత విధానాలు,వాణిజ్య పరమైన పరిశీలనలను ఆధారంగా రుణ నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) అనేది రుణ అర్హతను అంచనా వేయడంలో ఉపయోగపడే అంశాలలో ఒకటే, కానీ అది తుది నిర్ణయం కాదు అని ఆయన పేర్కొన్నారు. అయితే, సిబిల్ స్కోర్ లేకపోవడం కారణంగా రుణాలను చుక్కెదురు గా ఇవ్వరాదు అని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది.

వివరాలు 

ప్రతి వ్యక్తికి ఏటా ఒక ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందే అవకాశం 

రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు దరఖాస్తుదారుడి ఆర్థిక సామర్థ్యాన్ని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంది. గత రుణాలు, వాటి తిరిగి చెల్లింపు రీతులు, సెటిల్‌మెంట్‌లు లేదా రైట్-ఆఫ్‌లు వంటి వివరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. మరింతగా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CICs) ప్రతి వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్ కోసం గరిష్ఠంగా రూ. 100 మాత్రమే వసూలు చేయవచ్చని మంత్రి గుర్తుచేశారు. అలాగే, 2016లో RBI విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ప్రతి క్రెడిట్ బ్యూరో ప్రతి వ్యక్తికి ఏటా ఒకసారి ఉచితంగా ఎలక్ట్రానిక్ రూపంలో క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఆయన తెలియజేశారు.