Big Flipkart Fraud Found: రూ. 30,000 విలువైన స్పీకర్ ఆర్డర్ చేయగా.. ప్యాకేజీని తెరవడంతో షాక్..
ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వినియోగదారులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరే వస్తువులు డెలివరీ చేయడం లాంటివి కూడా అప్పుడప్పుడు జరిగాయి. ప్రస్తుతం కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇటీవల, ఒక వినియోగదారుడి స్నేహితులలో ఒకరు ఫ్లిప్‌కార్ట్ నుండి ఖరీదైన స్పీకర్‌ను ఆర్డర్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసారు. కానీ డెలివరీ బాక్స్‌లో అతనికి తక్కువ ధర కలిగిన బ్లూటూత్ స్పీకర్ వచ్చింది. అభిషేక్ భట్నాగర్ అనే వినియోగదారు ఈ-కామర్స్ కంపెనీ సమస్యను ఇంకా పరిష్కరించలేదని ఆరోపించారు.
ఫిర్యాదుదారు ఏం చెప్పారు?
భట్నాగర్ మాట్లాడుతూ, 'నా స్నేహితుడు (నిఖిల్) రూ. 30,000 విలువైన సోనోస్ స్పీకర్‌ను ఆర్డర్ చేయగా అతను సోనోస్ నుండి ఒక బాక్స్‌లో రూ. 2,400 విలువైన Mi బ్లూటూత్ స్పీకర్‌ను పొందాడు. తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, 'తప్పు లేదా నకిలీ ఉత్పత్తిని స్వీకరించినట్లు కస్టమర్‌కు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, వారు (ఫ్లిప్‌కార్ట్ వ్యక్తులు) స్పదించకపోవడం నిరాశపరిచింది' అని అన్నారు. 'ఫ్లిప్‌కార్ట్ పేరును ఫ్రాడ్‌కార్ట్‌గా మార్చాలి' అని పోస్ట్‌లో రాశారు.