LOADING...
IPOs: ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు
ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు

IPOs: ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం షేర్‌ మార్కెట్‌లోకి నాలుగు కొత్త తొలి పబ్లిక్‌ ఆఫర్లు (ఐపీఓలు) రాబోతున్నాయి. ప్రధాన విభాగంలో పటేల్‌ రిటైల్‌, శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌, రీగల్‌ రీసోర్సెస్‌, బ్లూస్టోన్‌ జువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ కంపెనీలు నిధుల సమీకరణ కోసం బరిలోకి దిగుతున్నాయి. ఇదే సమయంలో, గత వారం ప్రారంభమైన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌,ఆల్‌టైమ్‌ ప్లాస్టిక్స్‌ ఐపీఓలు ఈ రోజు ముగియనున్నాయి. అలాగే,గత వారం తమ ఐపీఓలు పూర్తిచేసుకున్న నాలెడ్జ్‌ రియాల్టీ ట్రస్ట్‌, హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌లు త్వరలోనే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ కానున్నాయి. సూపర్‌మార్కెట్‌ స్టోర్లను నిర్వహించే పటేల్‌ రిటైల్‌ ఐపీఓ ఆగస్టు 19న ప్రారంభమై 21న ముగియనుంది.

వివరాలు 

ఐపీఓ పరిమాణం రూ.250 నుంచి రూ.300 కోట్ల మధ్య..

ఇందులో భాగంగా 85.18 లక్షల కొత్త షేర్లను ఇష్యూ చేయడంతో పాటు,ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 10.02 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం ఐపీఓ పరిమాణం రూ.250 నుంచి రూ.300 కోట్ల మధ్య ఉండొచ్చని మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షిప్పింగ్‌ మరియు లాజిస్టిక్స్‌ సేవలు అందించే శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ ఐపీఓ కూడా ఆగస్టు 19నే ప్రారంభమై 21న ముగుస్తుంది. ఇది పూర్తిగా తాజా షేర్ల ఇష్యూ కాగా, కంపెనీ మొత్తం 1.63 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించబోతోంది. బ్లూస్టోన్‌ జువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ఐపీఓ ఆగస్టు 11న ప్రారంభమై 13న ముగియనుంది. ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.492 నుంచి రూ.517గా నిర్ణయించారు.

వివరాలు 

రీగల్‌ రీసోర్సెస్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.96 నుంచి రూ.102గా నిర్ణయం 

కంపెనీ ఈ ఆఫర్‌ ద్వారా రూ.1,540.65 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 29 షేర్లకు దరఖాస్తు చేయాలి. రీగల్‌ రీసోర్సెస్‌ ఐపీఓ ఆగస్టు 12న ప్రారంభమై 14న ముగియనుంది. దీనికి ధరల శ్రేణి రూ.96 నుంచి రూ.102గా నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 144 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.306 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

వివరాలు 

ఐపీఓకు ముందు భారత్‌పే నిధుల సమీకరణ 

ఐపీఓకు వచ్చే ముందు నిధుల సమీకరణ ప్రణాళికలు ఉన్నట్లు భారత్‌పే సీఈఓ నళిన్‌ నేగి తెలిపారు. అయితే, మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఐపీఓను ప్రారంభిస్తామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్రణాళికను మినహాయించి, నిర్వహణ లాభాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.