
GST Relief: టూత్‌పేస్ట్ నుంచి టైల్స్ దాకా.. జీఎస్టీ తగ్గించేందుకు కేంద్రం యోచన
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా ఆదాయపు పన్ను స్లాబ్ రూ.12 లక్షలకు పెంచి మధ్యతరగతిని ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మరో మంచి వార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. పేద, మధ్యతరగతికి ఊరట కల్పించేందుకు కేంద్రం వస్తువులపై ఉన్న గుడ్‌స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) రేట్లను తగ్గించే అంశంపై యోచిస్తోంది. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై పన్ను రేటును పూర్తిగా తొలగించాలా లేదా వాటిని 5 శాతం శ్లాబులోకి మార్చాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
Details
వీటిపై GST తగ్గే అవకాశం?
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై కేంద్రం దృష్టి పెట్టింది. వాటిలో ముఖ్యమైనవి: టూత్‌పేస్ట్, టూత్‌పౌడర్ కుట్టుమిషన్లు, గొడుగులు ప్రెజర్ కుక్కర్లు, గీజర్లు వంటగదిలో ఉపయోగించే పాత్రలు తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్లు సైకిళ్లు రూ.1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, ఫుట్‌వేర్ స్టేషనరీ వస్తువులు వ్యవసాయ ఉపకరణాలు వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్ ఈ జాబితాలోని వస్తువులపై జీఎస్టీ తగ్గితే వినియోగదారులకు తక్కువ ధరలకు అందే అవకాశం ఉంది. దీని వల్ల కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థకే ఊతం లభించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
కేంద్రానికి ఎంత భారం పడుతుంది?
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.40వేల నుంచి రూ.50వేల కోట్లు భారం పడే అవకాశముంది. అయినా వినియోగం పెరగడం వల్ల పన్ను ఆదాయం పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉందని కేంద్రం విశ్వసిస్తోంది. జీఎస్టీ మండలి కీలకం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులో జీఎస్టీ మండలి సమావేశం జరగనున్నదని సమాచారం. ఇకపై మధ్యతరగతి వర్గానికి మరిన్ని పాజిటివ్ సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.