Glance: గూగుల్ క్లౌడ్ టెక్నాలజీతో గ్లాన్స్ సేవలు మరింత విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
గ్లాన్స్, గూగుల్ క్లౌడ్ కలిసి జనరేటివ్ AI (GenAI) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా స్మార్ట్‌ఫోన్ లాక్ స్క్రీన్‌లు, అంబియంట్ TV స్క్రీన్‌లకు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా GenAI సొల్యూషన్లు అందించనున్నారు.
గూగుల్ సపోర్ట్ - గ్లోబల్ యూజర్లకు లాభం
గ్లాన్స్ ఇప్పటికే 450 మిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో అందుబాటులో ఉంది.
అందులో భారతదేశం, ఇండోనేషియా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో 300 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
Details
షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పించనున్న గ్లాన్స్
ఈ భాగస్వామ్యంతో గ్లాన్స్ సేవలు మరింత కొత్త స్థాయికి చేరుకోనున్నాయి.
GenAI ఉపయోగించి న్యూస్, స్పోర్ట్స్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్, షాపింగ్ వంటి అనేక విభాగాలను లాక్ స్క్రీన్‌లో నేరుగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
అంతేకాకుండా గూగుల్ గ్లాన్స్‌లో అదనపు పెట్టుబడి పెట్టినా ఆర్థిక వివరాలను మాత్రం సంస్థలు వెల్లడించలేదు.
GenAI సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు, గ్లాన్స్ Google Cloudతో Gemini ఇంటెలిజెన్స్, ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను Vertex AI ద్వారా వినియోగించనుంది.
GenAI ఆధారిత కామర్స్ ఫీచర్ ద్వారా, యూజర్లు స్వయంగా తమ ఫొటోలను అప్‌లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించింది.
యూజర్లు నేరుగా లాక్ స్క్రీన్ నుంచే షాపింగ్ చేయగలిగే అవకాశాన్ని కూడా గ్లాన్స్ అందిస్తోంది.
Details
2028 నాటికి బిలియన్ స్క్రీన్‌లను చేరాలన్న గ్లాన్స్ లక్ష్యం
ఈ నూతన ఫీచర్ అమెరికాలో 1 లక్ష మంది యూజర్లతో పరీక్షించారు. ఇందులో అమెరికాలోని ప్రముఖ రిటైల్ బ్రాండ్లు, టెలికాం సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
వినియోగదారులను AI ఆధారిత అనుభవాలతో కొత్త విషయాలను అన్వేషించేలా ప్రేరేపించడమే తమ లక్ష్యమని గ్లాన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ నవీన్ తివారీ పేర్కొన్నారు.
2028 నాటికి బిలియన్ స్క్రీన్‌లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యం కీలకమైనది అని తెలిపారు.
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, జనరేటివ్ AI టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తోందన్నారు.
గ్లాన్స్, GenAI టెక్నాలజీని ఉపయోగించి వినూత్నమైన యాప్‌లను అభివృద్ధి చేస్తూ వినియోగదారులకు కొత్త అవకాశాలను అందిస్తోందని అన్నారు.