
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి.. నేటి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో నిర్దారితమవుతాయి. ముఖ్యంగా డాలర్ మారక విలువలో మార్పులు దేశీయంగా పుత్తడి ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితి కారణంగా దేశంలోని బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. అదే విధంగా వెండి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. బంగారం స్వచ్చత పెరిగిన కొద్దీ దాని ధర కూడా పెరుగుతుంది. ప్రత్యేకంగా అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారట్లుగా కొలుస్తారు, దీనిని 'మేలిమి బంగారం' అని పిలుస్తారు. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఇతర లోహాలను కలుపుతారు. దీని స్వచ్చతను 22 క్యారట్లతొ కొలుస్తారు.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు
బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకొని కొనసాగుతూనే ఉంది. అయితే చాలా కాలం తర్వాత శుక్రవారం ( సెప్టెంబర్ 12వ తేదీ) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ, 24 క్యార్టుల బంగారం ధర ఇప్పటికీ రూ.1 లక్షకు పైగా కొనసాగుతోంది. ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 10 రూపాయలు తగ్గి ₹1,10,499కి పడిపోయింది. అలాగే, 22 క్యారట్ల బంగారం ధర కూడా 10 రూపాయల తగ్గింపుతో ₹1,01,290కి చేరింది. ఇదే ధరలు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలలో.. రాజమండ్రి, ప్రొద్దుటూరు , విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ లలో కూడా కొనసాగుతున్నాయి.
వివరాలు
దేశీయ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
న్యూఢిల్లీ లో 24 క్యార్టుల బంగారం 10 గ్రాముల ధర ₹1,10,650కి చేరగా, 22 క్యార్టుల బంగారం ₹1,01,440కి చేరింది. చెన్నై లో 24 క్యార్టుల బంగారం 10 గ్రాముల ధర ₹1,10,720గా, 22 క్యార్టుల బంగారం ₹1,01,490గా నమోదైంది. ముంబై లో 24 క్యార్టుల బంగారం 10 గ్రాముల ధర ₹1,10,500కి, 22 క్యార్టుల బంగారం ₹1,01,290కి చేరింది. ఇవే ధరలు కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పూణే వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
వివరాలు
వెండి ధర వివరాలు
బంగారం తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన లోహం వెండి. గత కొన్ని నెలలుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వినియోగం పెరగడం, పెట్టుబడిదారులు వెండిలో పెట్టుబడి పెట్టడం వలన ఈ లోహానికి అధిక డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా వెండి ధరలు రోజురోజుకీ పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 12 వ తేదీ నాటి పరిస్థితుల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గినా, దేశ రాజధాని న్యూఢిల్లీ మినహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ₹1,39,900కి పడిపోయింది. అయితే న్యూఢిల్లీ లో మాత్రం వెండి ధర కిలో ₹1,29,800గా కొనసాగుతోంది.