
Gold and Silver: పెరిగిన బంగారంధర.. స్వల్పంగా తగ్గిన వెండి .. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి.అదే విధంగా వెండి ధర కూడా పెరుగుతోంది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అంతేకాక, ప్రపంచ దేశాల్లో ట్రంప్ కారణంగా మొదలైన వాణిజ్య యుద్ధాలు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం వంటి వివిధ అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. అంతేకాక పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం కూడా ధరలకు తోడ్పడుతోంది. ఈ నేపథ్యంతోనే పసిడి ధరలు అధికస్థాయికి చేరుకున్నాయి. వెండి కూడా ఇలాగే పైబడి పయనిస్తోంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు:
ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,060కి చేరి, ఇది రూ. 10 పెరుగుదల సూచిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,610కి చేరి, 10 రూపాయల పెరుగుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ ధరల స్థితి కొనసాగుతోంది.
వివరాలు
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,760గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,210. ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,610, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,060గా కొనసాగుతోంది. చెన్నైలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,610, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,060. ఇదే స్థితి బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతోంది.
వివరాలు
ఈ రోజు వెండి ధర ఎలా ఉందంటే ..
వెండి కేవలం ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం మాత్రమే కాకుండా, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నిత్యావసర ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కూడా వెండి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంతో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పైకి చేరుతుంది. అయితే, ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర స్వల్పంగా తగ్గి రూ. 1,29,900కి చేరింది, అంటే ఒక్కరోజులో వంద రూపాయల మేర తగ్గుదల తగలింది.