Page Loader
Gold Rate: రూ.1లక్ష దాటిన బంగారం ధర.. పెళ్లిళ్ల ముందే పసిడి రేటు అమాంతం పెరుగుదల
రూ.1లక్ష దాటిన బంగారం ధర.. పెళ్లిళ్ల ముందే పసిడి రేటు అమాంతం పెరుగుదల

Gold Rate: రూ.1లక్ష దాటిన బంగారం ధర.. పెళ్లిళ్ల ముందే పసిడి రేటు అమాంతం పెరుగుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతంలోని ఇతర నగరాల్లో శనివారం (జూలై 20) నాటికి బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,729గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 1,00,069కి చేరుకుంది. వెండి ధర కిలో రూ. 1,29,300గా ఉంది. విజయవాడలో కూడా ధరలు అత్యంత సమీపంగా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,735 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,075గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,30,100గా కొనసాగుతోంది. విశాఖపట్టణంలో ధరలు కొద్దిగా పెరిగినట్లు కనిపించాయి.

Details

వెండి ధరల్లో స్వల్ప మార్పులు

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,737, 24 క్యారెట్ల ధర రూ. 1,00,077గా ఉంది. వెండి ధరను గమనిస్తే, 100గ్రాములకు రూ. 12,770గా ఉంది. బెంగళూరులో 22క్యారెట్ల బంగారం ధర రూ.91,715, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,055గా నమోదైంది. వెండి 100గ్రాముల ధర రూ. 11,600, కిలో వెండి ధర రూ. 1,18,100గా ఉంది. చెన్నైలో కూడా ధరలు ఈ స్థాయిలో కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,721, 24 క్యారెట్ల ధర రూ. 1,00,061గా ఉంది. వెండి 100గ్రాముల ధర రూ. 12,870గా ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి.