Page Loader
Goldman Sachs: బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు $3150కి పెరుగుతాయి గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా
బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు $3150కి పెరుగుతాయి గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా

Goldman Sachs: బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు $3150కి పెరుగుతాయి గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, 2025 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, ముడి చమురు ధరలు భారీగా పెరుగనున్నాయి. ఔన్స్‌ పసిడి ధర 2025 డిసెంబర్ నాటికి 3,150 డాలర్లకు చేరుకోవచ్చని, ఇది ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చితే 19 శాతం అధికం అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 2,550 డాలర్ల వద్ద ఉంది. ఈ అంచనాలు నిజమైతే, భారత మార్కెట్లో తులం బంగారం రూ.1,00,000 దాటడం తథ్యం. అలాగే, క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను చేరుకోగలదని భావిస్తున్నారు, ఇది ప్రస్తుతం 70 డాలర్లలో ఉంది.

వివరాలు 

గ్లోబల్ పరిస్థితుల ప్రభావం 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక ప్రతికూలతలు, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్‌లో నష్టాలు, రాజకీయ అస్థిరతల సమయంలో బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉండడం, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య పోరు వంటి అంశాలు క్రూడాయిల్ ధరలను పెంచగలవని చెబుతున్నారు.

వివరాలు 

అమెరికా నిర్ణయాల ప్రభావం 

అమెరికా ఆర్థిక పరిస్థితులు, సర్కార్ నిర్ణయాల వల్ల బంగారం, ముడి చమురు ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. వచ్చే ఏడాది ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల గోల్డ్‌, క్రూడ్‌ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ సాచ్స్‌ పేర్కొంది. అమెరికా రుణ భారం, సెంట్రల్‌ బ్యాంకుల బంగారం కొనుగోలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మార్పులు స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.

వివరాలు 

తాజా బంగారం, వెండి ధరలు 

తాజాగా, హైదరాబాద్‌లో బంగారం ధరలో లాభాలు నమోదయ్యాయి. 24 క్యారెట్ తులం బంగారం రూ.270 పెరిగి రూ.77,510కు చేరుకుంది. వెండి ధరలు కూడా ఒక్కరోజులో రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల పరిస్థితులు, స్థానికంగా పెరిగిన డిమాండ్‌ ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల కారణాలు ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్లలో ఒడిదొడుకులు, రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్‌ బ్యాంకుల బంగారంపై అధిక డిమాండ్‌, అమెరికాలో ఆర్థిక అస్థిరతలు, వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక వృద్ధి అంచనాల్లో తగ్గుదల. ఈ కారణాల నేపథ్యంలో, బంగారం, ముడి చమురు ధరలు రాబోయే కాలంలో మరింత పెరగవచ్చని స్పష్టంగా కనిపిస్తోంది.